Gautam Gambhir : బంగ్లాదేశ్ జట్టుతో త్వరలో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ కు భారత జట్టు ఖరారైంది. ఆదివారం బీసీసీఐ రోహిత్ నాయకత్వంలోని 16 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది. జట్టులో పంత్ కు అవకాశం లభించింది. అతడు దాదాపుగా రెండు సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ కు దూరమయ్యాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని అతడు స్ఫూర్తిదాయకమైన క్రికెట్ ఆడుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన విరాట్ కోహ్లీ చోటు సంపాదించుకున్నాడు.
గంభీర్ మార్క్
జట్టు కూర్పు విషయంలో గౌతమ్ గంభీర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ జట్టును కూడా గంభీర్ సూచనలకు అనుగుణంగానే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సిరీస్లో ఏ ఆటగాళ్లపై పక్షపాతం చూపించకుండా ఎంపిక చేసామని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఐదుగురు ఆటగాళ్లు చోటు సంపాదించుకోలేకపోయారు. ఒకసారి ఆటగాళ్ల గురించి పరిశీలిస్తే..
శ్రేయస్ అయ్యర్
బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో ఇతడు స్థానం సంపాదించుకోలేకపోయాడు.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ కు ముందు రంజి ట్రోఫీలో ఆడక పోవడంతో.. అప్పుడు కూడా జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ పక్కన పెట్టడం ఖాయం అని తేలిపోయింది. ఆ తర్వాత అతడికి దులీప్ ట్రోఫీ లో ఇండియా – డీ జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించింది. అయితే అతడు షార్ట్ పిచ్ బంతులకు తన వికెట్ సమర్పించుకున్నాడు. ఆ బలహీనతను రంజీలోనూ అతడు అధిగమించలేకపోయాడు. చివరికి బుచ్చిబాబు టోర్నీ లోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. గౌతమ్ గంభీర్ కు శ్రేయస్ అయ్యర్ ప్రియ శిష్యుడైనా బంగ్లా సిరీస్లో అతడికి అవకాశం లభించలేదు.
రజత్ పటిదార్
రజత్ పటిదార్ ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతడు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు. కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు..దులీప్ ట్రోఫీలో సత్తా చాటుతున్నప్పటికీ.. కోహ్లీ, రాహుల్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో రజత్ పటిదార్ కు అవకాశం లభించలేదు.
వాషింగ్టన్ సుందర్
బంతితో సత్తా చాటుతాడు. బ్యాట్ తో పరుగులు తీస్తాడు. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ వంటి వారు జట్టులోకి రావడంతో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం లభించలేదు. ఇంగ్లాండ్ సిరీస్ కు సుందర్ ఎంపికైనప్పటికీ అతడిని బీసీసీఐ రిలీజ్ చేసింది. రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్ లో ఆడాలని అతడికి ఆదేశాలిచ్చింది. ఇప్పుడు మాత్రమే కాదు టెస్ట్ జట్టుకు ఎంపికైనప్పటికీ సుందర్ కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.. ఇక ప్రస్తుతం స్టార్ ఆటగాళ్లు రీఎంట్రీ ఇవ్వడంతో.. ఇతడికి జట్టులో అవకాశం లభించలేదు.
కేఎస్ భరత్
అప్పట్లో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కేఎస్ భరత్ కు వరుసగా అవకాశాలు లభించాయి. క్రికెట్ల వెనుక గోడలాగా ఉండి.. ప్రత్యర్థి ఆటగాడిని అవుట్ చేసే భరత్.. బ్యాటింగ్ విషయంలో ఆ సత్తా కొనసాగించలేకపోతున్నాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇతడికి అవకాశం వస్తుందని అందరూ భావించినప్పటికీ జురెల్ కు అవకాశం ఇవ్వడంతో.. భరత్ చోటు దక్కించుకోలేకపోయాడు.
ముఖేష్ కుమార్
కేష్ కుమార్ 2023లోనే టెస్టుల్లోకి ప్రవేశించాడు. అప్పట్లో ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా ఎంపికయ్యాడు. కానీ నిలకడగా ఆడలేకపోయాడు. ఇప్పటివరకు అతడు కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం ఇతడి బదులు యష్ దయాళ్ పేస్ బౌలర్ కు అవకాశం ఇచ్చారు. ఇతడు లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తాడు కాబట్టి.. అలాంటి బౌలర్ ఉంటే జట్టుకు కలిసి వస్తుందని బంగ్లా సిరీస్ కు అవకాశం కల్పించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: The indian team has been finalized for the first test as part of the upcoming two test series against the bangladesh team
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com