Afghanistan Team : వన్డే వరల్డ్ కప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పసి కూన జట్లు కూడా సిరీస్‌లో భారీ స్కోర్లు చేస్తున్నాయి. దీంతో పెద్ద జట్లు విజయం కోసం శ్రమించాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఆదివారం మట్టికరిపించింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని జట్టు చేతిలో డిపెండింగ్ చాంపియన్ ఇంగ‍్లడ్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 50 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మానుల్లా గురాబాజ్(80) అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. గుర్బాజ్ వికెట్ తర్వాత వారు ప్లాట్‌ను కోల్పోయారు, అయితే మొత్తం 284 పరుగులు చేయగలిగారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఓటమి తప్పలేదు.
ఆ ఇద్దరే ఇంగ్లండ్ ఓటమిని రచించారు..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంగ్లండ్ పతనానికి స్క్రిప్ట్‌ను ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మెన్, భారత మాజీ కెప్టెన్ రాశారు. జోనాథన్ ట్రాట్ ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్. ప్రస్తుత ప్రపంచకప్ ఛాంపియన్స్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయంలో భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా కూడా కీలకపాత్ర పోషించారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఆయన ఆఫ్ఘనిస్థాన్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. బౌలర్ లేదా బ్యాట్స్‌మెన్లతో సంబంధం లేకుండా ప్రతీ ఆటగాడితో కలిసి పనిచేసేటప్పుడు కోచ్ పాత్ర కన్నా మెంటర్ పాత్ర ఎక్కువ. మెంటర్ పాత్ర కేవలం ఆటగాళ్లకు సాంకేతిక అంశాలను బోధించడమే కాదు, అతను మానసిక అంశాలపై కూడా పనిచేస్తాడు. సిరీస్ ఇండియాలో జరుగుతుండడం, అజయ్ జడేజాకు ఢిల్లీలోని పరిస్థితులపై పట్టు ఉండడంతో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రీడాకారులను మానసికంగా సిద్ధం చేశారు. గతంలో స్కాట్‌లాండ్‌కు కూడా మెంటర్‌గా పనిచేసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
జడేజా కేరీర్..
అజయ్ జడేజా 1992 నుంచి 2000 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 13 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహించి 8 మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించాడు. 1996 ప్రపంచకప్ క్వార్టర్-ఫైనల్‌లో పాకిస్థాన్‌పై కేవలం 25 బంతుల్లోనే 45 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రిటైర్మెంట్ తర్వాత జడేజా వ్యాఖ్యానం చేపట్టాడు. కొన్ని జట్లకు కోచ్‌గా కూడా ఉన్నాడు. అంతర్జాతీయ జట్టుతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. జడేజా మెంటర్‌గా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘనిస్తాన్ మూడింటిలో గెలిచింది. వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై కూడా గెలిచేలా వ్యూహరచన చేస్తున్నాడు.