https://oktelugu.com/

WPL 2023: బ్యాట్లు విరిగేలా.. బంతులు పగిలేలా: టీ 20 ల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం ఇలా ఉండాలి

WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో తొలి శతక భాగస్వామ్యం నమోదయింది. లీగ్ ప్రారంభమైన రెండవ రోజే అభిమానులకు వీనుల విందైన క్రికెట్ మజా లభించింది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్మృతి నిర్ణయం తప్పని కాసేపటికే అర్థమైంది. షేఫాలీ వర్మ (84), లానింగ్(72) కలిసి తొలి వికెట్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు ఇద్దరు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో […]

Written By:
  • Rocky
  • , Updated On : March 6, 2023 9:22 am
    Follow us on

    WPL 2023

    WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో తొలి శతక భాగస్వామ్యం నమోదయింది. లీగ్ ప్రారంభమైన రెండవ రోజే అభిమానులకు వీనుల విందైన క్రికెట్ మజా లభించింది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్మృతి నిర్ణయం తప్పని కాసేపటికే అర్థమైంది.

    షేఫాలీ వర్మ (84), లానింగ్(72) కలిసి తొలి వికెట్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు ఇద్దరు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో స్మృతి సేన బౌలర్లు తేలిపోయారు. వాళ్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ ఢిల్లీ ఓపెనర్లు మాత్రం ధాటిగా షాట్లు ఆడారు.. మొత్తానికి మహిళల ప్రీమియర్ లీగ్ లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    WPL 2023

    షేపాలీ, లానింగ్ కలిసి తొలి వికెట్ కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు..నైట్ ఇద్దరి భాగస్వామ్యాన్ని విడదీసినప్పటికీ… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. జెమీమా(22), కాప్(39) దాటియా బ్యాటింగ్ చేయడంతో ఢిల్లీ సులభంగా 200 పరుగుల మైలురాయి దాటింది. మ్యాచ్ ప్రారంభం నుంచి జోరు కొనసాగించిన ఢిల్లీ…నైట్ రెండు వికెట్లు తీయడంతో కొంచెం తడబడింది.. కానీ జెమీమా, కాప్ దాటిగా బ్యాటింగ్ చేయడంతో ఆమె కూడా తేలిపోయింది. దీంతో రెండు వికెట్ల నష్టానికి ఢిల్లీ 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. నైట్ మాత్రమే బెంగళూరు జట్టులో రెండు వికెట్లు తీసుకుంది. మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో కాకుండా పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు.. బెంగళూరు బౌలర్ల లోపాలను ఢిల్లీ బ్యాటర్లు తమకు అవకాశం గా మలుచుకున్నారు. ఫోర్లు,సిక్స్ లు కొట్టి జట్టు స్కోరును 223 పరుగుల దాకా తీసుకెళ్లారు.

    Tags