Hardik Pandya: ఆటను ఆటలాగా చూడాలి.. ఓటమైనా, గెలుపైనా ఒకే విధంగా తీసుకోవాలి. అలాంటప్పుడే అసలు సిసలైన పోటీ తత్వం కనిపిస్తుంది. కానీ కొంతమంది అభిమానులు ఆటను ఆటలాగా చూడరు. ఆడే క్రీడాకారులను దైవాంశ సంభూతులుగా భావిస్తారు. ప్రత్యర్థి ఆటగాళ్లను విలన్లుగా పరిగణిస్తారు. అంతటితోనే వారు ఆగరు.. మైదానంలో మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను గేలి చేస్తారు. చిత్ర విచిత్రమైన విమర్శలతో ఇబ్బంది పెడుతుంటారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు.. దానివల్ల ఆ అభిమానులు పైశాచిక ఆనందాన్ని పొందుతారేమో కానీ.. చూసే ఆటగాళ్లకు మాత్రం వారి మీద ఒక రకమైన అసహ్యమైన భావం ఏర్పడుతుంది. గురువారం నాటి ముంబై, బెంగళూరు మ్యాచ్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది..
ఈ మ్యాచ్లో తొలుత బెంగళూరు బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ముంబై జట్టు కేవలం 15.3 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.. వారి ధాటికి ముంబై స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే రన్ చేజింగ్ సమయంలో చివర్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ సమయంలో అభిమానులు అతడిని గేలి చేయడం మొదలుపెట్టారు. కొందరైతే ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం ప్రారంభించారు. దీంతో హార్దిక్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. అయితే మైదానంలో ఉండి ఈ పరిస్థితిని మొత్తం గమనిస్తున్న బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులను మందలించాడు. తన సంకేతాలతో వారిని అదుపులో ఉండాలని సూచించాడు..”అతడు ఇండియన్ ఆటగాడే కదా. మీరెందుకు అతడిని గేలి చేస్తున్నారు. అతడిని ఆడనివ్వండి.” అని కోహ్లీ అనగానే.. అభిమానులు ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత హార్దిక్.. హార్దిక్ అంటూ అరవడం మొదలుపెట్టారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. “ఒక సాటి ఆటగాడికి మరొక ఆటగాడు కచ్చితంగా అండగా ఉండాలి. ముఖ్యంగా ఉద్వేగాలు తారాస్థాయిలో ఉండే క్రికెట్లో అది మరింత ముఖ్యం. గురువారం నాటి మ్యాచ్లో కోహ్లీ దానిని నిరూపించాడు. అతడి ప్రవర్తన బాగుంది. అభిమానులు హద్దుల్లో ఉండాలి. ఆటను ఆటతీరుగా చూడాలి. వ్యక్తిగతంగా ఆటగాళ్లే తీసుకోనప్పుడు మధ్యలో అభిమానులకు వచ్చిన నష్టం ఏంటి” అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.. కాగా, హార్దిక్ పాండ్యా కు కోహ్లీ మద్దతుగా నిలిచిన తీరు పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అభిమానుల తీరు పట్ల నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Virat Kohli reminding the crowd that Hardik Pandya is an Indian player.
– Well done, Virat…!!!pic.twitter.com/fntdSMQSfS
— Johns. (@CricCrazyJohns) April 11, 2024
Eventually the Mumbai crowd started supporting Hardik Pandya when Virat Kohli stopped the crowd from booing him. Crowd were chanting Hardik Hardik yesterday. pic.twitter.com/KIM00YGi5k
— Satya Prakash (@Satya_Prakash08) April 12, 2024