IPL 2022: భారతీయ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదరు చూస్తున్న తరుణం రానే వస్తోంది. ఇండియాలో అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో సగటు క్రికెట్ అభిమాని ఈ లీడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. పైగా రెండేండ్ల తర్వాత స్టేడియంలోకి అభిమానులను ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో అన్ని మ్యాచ్‌లను ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, పుణేలోని ఎంసీఏ గ్రౌండ్ లోనే మ్యాచులు మొత్తం నిర్వహిస్తున్నారు. కేవలం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లలో పాటుగా అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టికెట్స్ కూడా అందుబాటులో ఉంచారు.
Also Read: RRR Movie Review: రివ్యూ : ‘ఆర్ఆర్ఆర్’
మే 29 వరకు ఈ లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ ఐపీఎల్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ నిర్వాహకులకు, బీసీసీఐ అధికారులకు షాక్ ఇస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు టార్గెట్ గా ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన పరిస్థితి నెలకొంది.
ఈ విషయంపై ఇప్పటికే క్విక్ రెస్పాన్స్ బాంబ్ స్వ్కాడ్ టీమ్ అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. అటు ముంబైలోనే మొత్తం మ్యాచులు నిర్వహిస్తుండటంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయిపోయింది. ఇప్పటికే కొందరు ఉగ్రావాదులు మారువేశాల్లో స్టేడియాల వద్ద, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్ల దగ్గర రెక్కీ నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై ముంబై పోలీసులు స్పందించారు. తమకు ఇంటలిజెన్స్ ఆఫీసర్ల నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని, కానీ తాము భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. క్రికెటర్లు బస చేస్తున్న హోటల్స్, స్టేడియాల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే సెక్యూరిటీ గైడ్ లైన్స్ కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై ఎలాంటి భయాందోళన వద్దని బీసీసీఐ ప్రకటించినట్టు తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan: నేతాజీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఆ స్ఫూర్తి రగిలిస్తారా?