Telugu Cricketers: మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతంగా ఉంటుంది. ఈ మాట అనడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఇక భారత క్రికెట్ జట్టులో అవకాశం లభించాలంటే అది అంత సులువైన మార్గం కాదు. ఒక్క అవకాశం కోసం లక్షల మంది నుంచి పోటీ ఎదుర్కోవాలి. అత్యుత్తమంగా రాణించాలి. అప్పుడే వారికి జాతీయ జట్టులో అవకాశం లభిస్తుంది.. ఒకవేళ అవకాశం లభించినా.. దానికి తగ్గట్టుగా ప్రతిభను నిరూపించుకుంటూనే స్థానం సుస్థిరంగా ఉంటుంది. లేకుంటే అదే చివరి అవకాశం అవుతుంది.. ఇక మన భారత క్రికెట్లో ప్రస్తుత కాలంలో నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ పురుషుల జట్టులో విశేషంగా రాణిస్తున్నారు. ఇప్పుడు మహిళల జట్టులో గొంగడి త్రిష కీలక ప్లేయర్గా మారారు.. వీరంతా కూడా ఎంతో కష్టపడ్డారు. క్రికెట్లో నైపుణ్యాన్ని సాధించారు. జట్టులో అనేక అష్ట కష్టాలు పడి స్థానాన్ని దక్కించుకున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కీలకమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.. భవిష్యత్తు ఆశా కిరణాలుగా రూపాంతరం చెందారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చి.. క్రికెట్ లో నైపుణ్యం సంపాదించి.. యావత్ భారత క్రికెట్ ప్రేమికుల మన్ననలు పొందారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చి..
గొంగడి త్రిష కుటుంబం అతి సామాన్యమైనది. త్రిషను ఆమె తండ్రి రామిరెడ్డి విశేషంగా ప్రోత్సహించారు.. ఆయన ప్రోత్సాహంతోనే క్రికెట్లో త్రిష ట్రైనింగ్ తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన త్రిష కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లు స్థిరంగా రాణిస్తోంది.. ప్రపంచ కప్ కంటే ముందు ఆసియా కప్ జరిగింది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లలో త్రిష ఆడింది. 53 సగటు ద్వారా 159 రన్స్ చేసింది. హైయెస్ట్ స్కోరర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 టోర్నీలో త్రిష వేరే విహారం చేసింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై మూడు వికెట్లు తీయడంతో పాటు 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అందువల్లే ఆమె అండర్ 19 టోర్నీలో ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్, ఉమెన్ ఆఫ్ ది సిరిస్ పురస్కారాలు దక్కించుకుంది.. ఒకప్పుడు అజహారుద్దీన్, ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్, మహిళల విభాగంలో మిథాలి రాజ్ సత్తా చాటారు.. తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, గొంగడి త్రిష తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. క్రికెట్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నారు. అంతేకాదు భారత జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు.