Telugu Cricket Commentary: క్రికెట్ కు ఉన్న క్రేజ్ తెలుగు కామెంటరీతో మరింత పెరిగింది. గతంలో కేవలం రేడియో, టెలివిజన్లలో ఇంగ్లీష్, హిందీ కామెంటరీ మాత్రమే ఉండేది. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రాంతీయ భాషల్లో కూడా కామెంటరీ ఉండాలని చేసిన ప్రయత్నం ఈ క్రేజ్ ను మరింత పెంచింది.
Also Read: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే.. పది టీమ్ లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
1960-70 దశకాల్లో, భారతదేశంలో క్రికెట్ పెరుగుతున్న రోజుల్లో ఆంగ్ల ప్రభావాన్ని తెలుగు ప్రజలు కూడా ఆస్వాదించటం మొదలుపెట్టారు. అయితే, ఆకాశవాణి (All India Radio) తెలుగు విభాగం ద్వారా తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లను తెలుగు భాషలో ప్రసారం చేయడం ప్రారంభమైంది. ఆ రోజులలో కామెంటరీ చాలా సాధారణంగా ఉండేది.
జాతీయ స్థాయి కామెంటేటరులు సుజాత, రామచంద్రం, భాస్కరరావు భాష మాధుర్యంతో తెలుగు ప్రేక్షకులకు క్రికెట్‌ను మరింత దగ్గరగా చేశారు.
1980-90 దశకంలో
టీవీలు రంగ ప్రవేశం చేసిన తరువాత ప్రత్యేకంగా డిడిడి (దూరదర్శన్) తెలుగు ఛానల్‌లో క్రికెట్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మొదట్లో టీవీలోనూ ఆంగ్ల వ్యాఖ్యానమే ఉన్నప్పటికీ, రేడియో తెలుగు కామెంటరీ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ఆదరణ పొందింది.
అప్పట్లో మద్దూరి నాగరాజు, నీలం రాజు వంటి ప్రతిభావంతులు, వినోదాత్మక తెలుగు పదజాలంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
* 2000 తర్వాత స్టార్ స్పోర్ట్స్, సోనీ టెన్ స్పోర్ట్స్ వంటి ఛానళ్ళ రాకతో తెలుగు కామెంటరీకి పెద్దపేట వేశారు.
2008లో ఐపిఎల్ ప్రారంభమైన తర్వాత, తెలుగు కామెంటరీకి భారీ డిమాండ్ వచ్చేసింది. ప్రతి మ్యాచ్‌ను ప్రజలు తాము భాషలోనే ఆస్వాదించాలనే అభిలాష పెరిగింది. కొత్త తరం కామెంటేటర్లు రంగప్రవేశం చేశారు. రేడియో శైలిని పక్కనపెట్టి, ప్రొఫెషనల్ టీవీ శైలిని అవలంబించారు. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగు, జియో సినిమా, హాట్‌స్టార్ లాంటి డిజిటల్ మాధ్యమాల్లో తెలుగు కామెంటరీ ప్రాధాన్యత పెరిగింది. యువత, మాజీ క్రికెటర్లు, ప్రొఫెషనల్ వ్యాఖ్యాతలు కలిసి బృందంగా పనిచేస్తున్నారు. గణాంక విశ్లేషణ, ఫీల్డ్ సెట్టింగ్ వివరాలు, ఆటగాళ్ల మానసిక స్థితి విశ్లేషణలు, ఇవన్నీ కూడా తెలుగులో చక్కగా అందిస్తున్నారు.
తెలుగు కామెంటరీలో లబ్ధప్రతిస్టులుగా పేరు తెచ్చుకున్న వారిలో ముఖ్యులు.. మహవాది సోదరులు సుధీర్, విజయ్, కామొజ్జల చంద్రమోహన్, జె.శ్రీనివాస్, ఇల్లెందుల శ్రీనివాస్, వీరబాబు గరికపాటి,
కొల్లారం కళ్యాణ్, ఎంఎస్కే ప్రసాద్, అంబటి రాయుడు, ఎలమంచిలి సుమన్, విహారితో పాటు
కొత్త తరపు మహిళా కామెంటేటర్లు కూడా తమదైన శైలి లో వ్యాఖ్యానాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నారు.
* భవిష్యత్లో
తెలుగు కామెంటరీకి ఆటోమేటెడ్ ట్రాకింగ్, రియల్‌టైమ్ గణాంకాల అనుసంధానం జరగబోతోంది. స్థానిక లీగ్స్, ప్రాదేశిక టోర్నమెంట్స్ (ఉదా: తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లీగ్స్) తెలుగు కామెంటరీతో ప్రసారం కానున్నాయి. తెలుగు భాషను ప్రపంచం గర్వంగా వినేలా, అంతర్జాతీయ మేళాలలో కూడా తెలుగు కామెంటరీ వినిపించే రోజులు దూరంలో లేవు.
Also Read: కేఎల్ రాహుల్ కాంతారా స్టెప్ వేసి టీజ్ చేసిన కోహ్లీ: వీడియో వైరల్