Team India: టీమిండియా విలాపం.. కొత్త కెప్టెన్ ఎవరంటే? క్రికెట్ భవిష్యత్తుకు ఏం చేయాలి?

Team India: టీమిండియా అభిమాని గుండె పగిలింది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ప్రపంచకప్ టీ20లో గ్రూప్ దశలోనే వైదొలిగిన ఇండియన్ క్రికెట్ టీంను చూసి భోరుమంటున్నారు. ఆ విలాపం అంతులేని ఆవేదనగా ఉంది. ఈ క్రమంలోనే చిన్న జట్లపై రెచ్చిపోయి పెద్ద జట్లపై తేలిపోయిన టీమిండియా తీరును ప్రతి ఒక్క అభిమాని ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాను ప్రక్షాళన చేయాలని.. పోటీ లేకపోవడంతోనే ఆటగాళ్లలో ఈ నిర్లప్తత పేరుకుపోయిందని అంటున్నారు. టీమిండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, […]

Written By: NARESH, Updated On : November 9, 2021 9:26 am
Follow us on

Team India: టీమిండియా అభిమాని గుండె పగిలింది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ప్రపంచకప్ టీ20లో గ్రూప్ దశలోనే వైదొలిగిన ఇండియన్ క్రికెట్ టీంను చూసి భోరుమంటున్నారు. ఆ విలాపం అంతులేని ఆవేదనగా ఉంది. ఈ క్రమంలోనే చిన్న జట్లపై రెచ్చిపోయి పెద్ద జట్లపై తేలిపోయిన టీమిండియా తీరును ప్రతి ఒక్క అభిమాని ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియాను ప్రక్షాళన చేయాలని.. పోటీ లేకపోవడంతోనే ఆటగాళ్లలో ఈ నిర్లప్తత పేరుకుపోయిందని అంటున్నారు.

team india captain

టీమిండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గా రవిశాస్త్రి నిన్నటితో దిగిపోయారు. ఇప్పుడు అపర ద్రోణాచార్యుడిగా మారిన సీనియర్ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను టీమిండియాకు కోచ్ గా బీసీసీఐ చేసింది. యువ క్రికెటర్లను నేర్పుగా తీర్చిదిద్దుతూ భారత బ్యాచ్ బెంచ్ ను స్ట్రాంగ్ గా తయారు చేసిన ఘనత రాహుల్ ద్రావిడే. ఈరోజు నుంచి ఆయనే కోచ్.

ఐపీఎల్ లో రాణించిన వారిని కాదని.. పాత టీంను ఎంపిక చేయడం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చేసిన పెద్ద తప్పు. ఐపీఎల్ లో విశేషంగా రాణించి అత్యధిక వికెట్లు పరుగులు చేసిన రుతురాజ్, హర్షల్ పటేల్, సిరాజ్, చాహల్ లాంటి వారిని టీమిండియాకు ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పు. ఆ తప్పును మరోసారి పునరావృతం చేయవద్దని.. కెప్టెన్సీ విషయంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ద్రావిడ్, బీసీసీఐ డిసైడ్ అయ్యిందట..

2007లో ధోని సారథ్యంలో టీమిండియా చివరి ప్రపంచకప్ టీ20 సాధించింది. ఆ తర్వాత ఇంతవరకూ కప్ లేదు. 2014లో ఫైనల్ లో ఓడింది. కోహ్లీ సారథ్యంలో 2016 సెమీస్ లో ఓడింది, 2019 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమి. 2022లోనూ మరోసారి ప్రపంచకప్ టీ20లో ఓటమి.

కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ కే ప్రాధాన్యమిచ్చే అక్కడే భారీగా పరుగులు సాధిస్తున్నారు. దీంతో జట్టు సమతూకం దెబ్బతింటోంది. ఈ క్రమంలోనే ఈ లోతుపాతుల్ని కూలంకషంగా అధ్యయనం చేయడంతోపాటు టెస్టులు, వన్డేలు టీ20లకు భిన్నసారథుల్ని ఎంపిక చేయాలన్న సూచనలను బీసీసీఐ నిశితంగా పరిశీలించాలి. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్ల ఏకగ్రత, లయ దెబ్బ తింటుంది. అందుకే రొటేషన్ అమలు చేయాలి. ఈ కోచ్ ద్రావిడ్, బీసీసీఐ మెరుగైన కెప్టెన్ ను టీమిండియాకు ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. జట్టులో నిలకడ, సమతూకం, బౌలింగ్ లో వైవిధ్యం కొనసాగేట్లు చూసుకోవడం యాజమాన్యం బాధ్యత. ఇప్పటికే బీసీసీఐ టీమిండియాను ప్రక్షాళన చేసి మెరుగైన జట్టును ఇప్పటి నుంచే తయారు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వచ్చే ప్రపంచకప్ ను అయినా టీమిండియా సాధించగలుగుతుంది.