Champions Trophy : భారత్ దెబ్బకు దిగొచ్చిన పాక్.. దుబాయ్ లో టీమిండియా మ్యాచ్ లు…అసలేం జరిగిందంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్ వేదికగా నిర్వహిస్తుంది అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ను బిసిసిఐ పాత్ర ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు...

Written By: NARESH, Updated On : December 29, 2023 7:52 pm
Follow us on

Champions Trophy : ప్రస్తుతం బీసీసీఐ తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఐసిసి నిర్వహించిన ట్రోఫీలను కూడా బీసీసీఐ పట్టించుకోవట్లేదు ఎందుకంటే 2024 లో ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ వేదికగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ తీసుకునే నిర్ణయానికి బీసీసీఐ మాత్రం కట్టబడి ఉండడం లేదన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు అప్పుడే ఇండియన్ టీమ్ పర్యటించే అవకాశం అయితే లేదు ఒకవేళ పాకిస్తాన్ లోనే ఐసిసి టోర్నీ ని నిర్వహించినట్లయితే ఇండియన్ టీమ్ ఆ టోర్నీ కి హాజరయ్యే ప్రసక్తే లేదు అంటూ బీసీసీఐ తేల్చేసి చెప్పడంతో ఇప్పుడు ఐసిసి కి ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఎందుకంటే ఇండియన్ టీం లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం అనేది అసాధ్యమనే చెప్పాలి ఎందుకంటే ఇండియన్ టీం వల్లే ఆ ట్రోఫీకి భారీ లాభాలు వస్తాయి. అలాగే ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించే మ్యాచులు ఆడటం ఇండియన్ టీం వల్లే సాధ్యమవుతాయి. కాబట్టి ఇప్పుడు ఐసీసీ ఇంతకుముందు ఆసియా కప్ ను ఏ విధంగా అయితే నిర్వహించిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిని పాటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆసియా కప్పు ను కూడా పాకిస్తాన్ లో నిర్వహిస్తాను అంటే ఇండియన్ టీం ఆ దేశానికి రమ్మని చెప్పడంతో శ్రీలంకలో నిర్వహించారు. ఇక ఇప్పుడు కూడా చాంపియన్స్ ట్రోఫీని దుబాయ్ లో నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇండియన్ టీం కోసం ఐసీసీ తన రూల్స్ మొత్తాన్ని మార్చుకుంటుంది. ఇదంతా చూస్తున్న పాకిస్తాన్ కి మాత్రం ఇదంతా నచ్చడం లేదు కానీ పాకిస్తాన్ ఏం చేయాలనే పరిస్థితి లో ఉంది. ఒకవేళ ఐసిసి నిర్వహించే టోర్ని ని పాకిస్తాన్ లో నిర్వహించకపోతే మేము ఐసీసీ టోర్నీలో పార్టిసిపేట్ చేయలేము అని చెప్పిన కూడా ఈ నిర్ణయాన్ని ఐసిసి పట్టించుకోవట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ ఆడకపోయిన ఐసిసి నిర్వహించే ట్రోఫీలు సక్రమంగా నడుస్తాయి కానీ ఇండియన్ టీం ఆడకపోతే మాత్రం ఐసిసి టోర్నీ ఆడటం కష్టం అనే విషయం ఐసీసీ తో పాటు పాకిస్తాన్ వాళ్ళకి కూడా తెలుసు అందుకే వాళ్ళు ఐసీసీ ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వస్తున్నారు…

ప్రస్తుతం బీసీసీఐ ని బట్టి ఐసీసీ నిర్ణయాలు తీసుకుంటుంది ఐసీసీ ని కూడా శాసించే స్థాయికి బీసీసీఐ ఎదగడం నిజంగా గర్వకారణం అనే చెప్పాలి. బీసీసీఐ తీసుకుని నిర్ణయాలకు కట్టుబడి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్ వేదికగా నిర్వహిస్తుంది అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ను బిసిసిఐ పాత్ర ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…