https://oktelugu.com/

Team India cricket schedule: సరికొత్త ఆశలతో 2022 ఇండియన్ క్రికెట్.. ఇక విజయాలే..

Team India cricket schedule: 2021 వ సంవత్సరం కాలగర్భంలోకి కలిసి పోయి..నూతన సంవత్సరం 2022 స్టార్ట్ అయింది. సరికొత్త ఆశలతో ప్రారంభమైన ఈ ఏడాదిలో అభిమానులను అలరించేందుకుగాను క్రికెట్ రెడీ అయింది. టీమిండియా పర్ఫార్మెన్స్ ఈ సారి బెస్ట్‌గా ఉండబోతుందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. గతంతో పోల్చితే ఈ సారి మరింత గట్టిపోటీ ఇవ్వడంతో పాటు అభిమానులను ఆనందింపజేయడానికి చాలా కష్టపడనున్నారు క్రికెటర్స్. టీమిండియా పర్ఫర్మెన్స్ ఈ ఇయర్ ది బెస్ట్‌గా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 2, 2022 / 01:17 PM IST
    Follow us on

    Team India cricket schedule: 2021 వ సంవత్సరం కాలగర్భంలోకి కలిసి పోయి..నూతన సంవత్సరం 2022 స్టార్ట్ అయింది. సరికొత్త ఆశలతో ప్రారంభమైన ఈ ఏడాదిలో అభిమానులను అలరించేందుకుగాను క్రికెట్ రెడీ అయింది. టీమిండియా పర్ఫార్మెన్స్ ఈ సారి బెస్ట్‌గా ఉండబోతుందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.

    Team India cricket schedule

    గతంతో పోల్చితే ఈ సారి మరింత గట్టిపోటీ ఇవ్వడంతో పాటు అభిమానులను ఆనందింపజేయడానికి చాలా కష్టపడనున్నారు క్రికెటర్స్. టీమిండియా పర్ఫర్మెన్స్ ఈ ఇయర్ ది బెస్ట్‌గా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

    గతేడాది డిసెంబర్‌లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడు టెస్టు సిరీస్‌లలో తొలి సిరీస్ లో విరాట్ కోహ్లీ సేన విజయం సాధించింది. రెండో మ్యాచ్ సోమవారం జరగనుంది.  మూడో మ్యాచ్ ఈ నెల 11న జరగనుంది. ఇకపోతే ఈ ఏడాదిలో సొంతగడ్డపైన భారత్ మొదటి ఆట (వన్డేలు, సిరీస్ లు) ఫిబ్రవరిలో ఉంటుంది.ఈ ఏడాది భారత్ శ్రీలంకకు ఆతిథ్యం కూడా ఇవ్వనుంది.

    Also Read:  ‘గంటా’ స్కెచ్.. జనసేనాని పవన్ ను కింగ్ మేకర్ గా నిలబెడతాడట?

    ధనాధన్ ఆట ఐపీఎల్ కూడా ఈ ఏడాది ఉంటుంది. ఈ సారి స్వదేశంలోనే లీడ్స్ జరిగే చాన్సెస్ ఉన్నాయి. జూన్‌లో సొంతగడ్డపై సౌత్ ఇఫ్రికాతో టీమిండియా తలపడనుంది. జూలైలో ఇంగ్లాండ్ పర్యటన అనంతరం.. వెస్టీండీస్ పర్యటన ఉండే చాన్సెస్ ఉన్నాయి. ఈ సారి దాయాది దేశాలు అయిన భారతదేశం, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్‌లో మ్యాచ్ ఉండనుంది. ఆసియా కప్ రూపంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ తన పర్ఫార్మెన్స్ బెస్ట్ గా ఇవ్వనుంది.

    గతేడాది టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా నిరాశపరిచింది. కాగా, ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్ పైన భారత్‌కు ఆశలు అయితే ఉన్నాయి. ఈ సారి కప్ భారత్‌కు లభిస్తుందని అశేష భారతావని ఆకాంక్షిస్తోంది. ఇకపోతే అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ స్టార్ట్ కానుంది. చూడాలి మరి.. ఈ సారి కప్ ఎవరు గెలుచుకుంటారో.. ఇక చివరగా ఈ ఏడాది చివరలో బంగ్లాదేశ్‌కు భారత జట్టు పర్యటన ఉండే చాన్సెస్ ఉన్నాయి. సరి కొత్త విజయాలను ఈ సారి భారత క్రికెట్ జట్టు తన ఖాతాలో నమోదు చేస్తుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

    Also Read:  ఆర్ఆర్ఆర్ వాయిదా: తెగ వైరల్ అవుతున్న మీమ్స్

    Tags