https://oktelugu.com/

India vs SA: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సఫారీల గడ్డపై టీమిండియా చారిత్రక విజయం

India vs SA: సఫారీల గడ్డ.. బంతి వేస్తే ఊహించనంత బౌన్స్ లేసే పక్కా సీమ్ పేస్ మైదానాలు.. పచ్చగా పోతపోసినట్టు గడ్డితో కళకళలాడే మంచి గట్టి పిచ్ లపై టీమిండియా ఎప్పుడూ సిరీస్ గెలిచింది లేదు. కానీ ఇప్పుడు మన టీమిండియా సాధించింది. 3 టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి 1-0తో లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుత ఫాం చూస్తే టీమిండియా సిరీస్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.. సఫారీల గడ్డపై ఈ మేరకు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2021 5:42 pm
    Follow us on

    India vs SA: సఫారీల గడ్డ.. బంతి వేస్తే ఊహించనంత బౌన్స్ లేసే పక్కా సీమ్ పేస్ మైదానాలు.. పచ్చగా పోతపోసినట్టు గడ్డితో కళకళలాడే మంచి గట్టి పిచ్ లపై టీమిండియా ఎప్పుడూ సిరీస్ గెలిచింది లేదు. కానీ ఇప్పుడు మన టీమిండియా సాధించింది. 3 టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి 1-0తో లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుత ఫాం చూస్తే టీమిండియా సిరీస్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.. సఫారీల గడ్డపై ఈ మేరకు టీమిండియా చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు.

    India vs SA:

    India vs SA:

    దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుతం చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను ఏకంగా 113 పరుగుల తేడాతో ఓడించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

    Also Read:  రిటైర్ మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. క్రికెట్ కు గుడ్ బై

    నాలుగో రోజు ఆట ముగిసే సరికి 94/4తో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు మరో 97 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, షమీ తలో మూడు వికెట్లు తీశారు. సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.

    దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ప్రారంభం నుంచి టీమిండియానే ఆధిక్యం ప్రదర్శించింది.కేఎల్ రాహుల్ (123)సెంచరీ, మయాంక్ అగర్వాల్ (60) రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులు చేసింది. అనంతరం సౌతాఫ్రికా 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ ఇక్కడే భారత్ వైపు మొగ్గింది. పరుగులు చేయడానికి తటపటాయిస్తున్న మైదానంపై సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

    Also Read:  ప్రీ రిలీజు అడ్డంకులను ‘ఆర్ఆర్ఆర్’ అధిగమించేనా?