ENG Vs IND 5th Test: ఐదో టెస్టులో గెలవలసిన సందర్భంలో టీమిండియా ఓటమి అంచులో ఉండడానికి ప్రధాన కారణం బ్రూక్ క్యాచ్ ను సిరాజ్ మిస్ చేయడం మాత్రమే కాదు.. ఇంక చాలా ఉన్నాయి. సిరాజ్ బ్రూక్ క్యాచ్ ను బౌండరీ లైన్ అందుకొని..రోప్ ను తగలడం మాత్రమే కాదు.. టీమిండియా ఓటమి అంచులో ఉండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
Also Read: 372 టార్గెట్ విధించినా.. ఇంత దారుణమా.. గౌతమ్ గంభీర్ వల్లే ఈ అనర్థాలు
ఐదో టెస్టులో ముగ్గురు బౌలర్లతోనే టీమిండియా రంగంలోకి దిగడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. పైగా ప్రసిద్ద్ కృష్ణకు అవకాశం కల్పించడం పట్ల మాజీ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే లండన్ ఓవల్ పిచ్ డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో బంతి అనూహ్యంగా మలుపులు తిరుగుతుంది. మిగతా సందర్భాలలో బ్యాట్ మీదికి వస్తుంది. అలాంటప్పుడు బౌలర్లు అలసిపోతే ఇక అంతే సంగతులు. ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో అదే జరిగింది. టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు బౌలర్లు తీవ్రంగా అలసిపోయారు. స్పిన్ బౌలర్ల బౌలింగ్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు ధాటిగా ఆడారు. దీంతో కెప్టెన్ గిల్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ముగ్గురు బౌలర్ల మీదనే ఆధారపడాల్సి వచ్చింది.
Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!
ఒకానొక దశలో ఆకాష్ దీప్ ఇంగ్లాండ్ బ్యాటర్ కొట్టిన బంతి కాలికి తగిలింది. దీంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకానొక దశలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడేమోనని అందరు అనుకున్నారు. కెప్టెన్ గిల్ అయితే ఇంజక్షన్ ఏమైనా చేయించాలా.. అని అడిగాడు. అలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ ఆకాష్ జట్టు కోసం ఆడాడు. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన బ్రూక్ ను అవుట్ చేశాడు..రూట్ కూడా ప్రసిద్ద్ కు దొరికిపోయాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు టీమిండియాను తీవ్రంగా బాధపెట్టాయి. వాస్తవానికి 370+ కి పైగా పరుగులు చేసినప్పటికీ భారత్ ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడం లో ఆటగాళ్ల వైఫల్యం కంటే.. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు దీనికి కారణంగా నిలిచాయి. ఏది ఏమైనప్పటికీ జట్టుకూర్పు విషయంలో మేనేజ్మెంట్ ఎలా ఉండాలో ఈ టెస్ట్ సిరీస్ మరోసారి చెబుతోంది. దీని ద్వారా అయినా సరే మేనేజ్మెంట్ మారుతుందా? సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.