Team India Squad : 2007 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు టీమ్ ఇండియా మరోసారి ఇంగ్లాండ్ జట్టుపై సిరీస్ సొంతం చేసుకోలేదు. 2007 నుంచి అనేక పర్యాయాలు టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించినప్పటికీ.. సిరీస్ దక్కించుకునే స్థాయిలో విజయాలను నమోదు చేయలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. గత ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ భారత్లో పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. తొలి టెస్ట్ లో విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టులలో ఓడిపోయింది. మొత్తంగా భారత్ 4-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది.
నాటి పరాభవానికి
గత ఏడాది టీమిండియా వేదికగా ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో తీవ్రమైన కసరత్తు చేస్తుంది. మరోవైపు టీమ్ ఇండియాలో పరిస్థితి గందరగోళంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లీ కూడా అదే దారిని అనుసరించాడు. ఇంగ్లాండ్ టూర్ కు ముందు టీమిండియా కు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు.
ఎవరిని నియమిస్తారు
రోహిత్ స్థానంలో ఎవరిని కెప్టెన్ గా నియమించాలి? విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి? అనే ప్రశ్నలు టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ను వెంటాడుతున్నాయి. వాస్తవానికి బుమ్రా నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా చెబుతున్నారు. మరికొందరేమో గిల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అయితే సీనియార్టీ దృష్ట్యా బుమ్రా వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు బుమ్రా గాయాలతో ఇబ్బంది పడుతున్న వేళ.. అతడిని సారధిగా నియమించడం సరైన నిర్ణయం కాదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఇక గిల్, బుమ్రా సంగతి అటు ఉంచితే.. నెంబర్ 4 లో ఎవరిని ఆడిస్తారనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్టులలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. మరి అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారు? ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు? అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇంతవరకు మేనేజ్మెంట్ ఒక క్లారిటీ అంటూ ఇవ్వడం లేదు.
మరోవైపు కెప్టెన్ గా ఎవరిని నియమించాలి? నాలుగో స్థానంలో ఎవరితో బ్యాటింగ్ చేయించాలి? అనే అంశాలపై కొద్ది రోజులుగా గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తీవ్రంగా చర్చలు చేస్తున్నట్టు తెలుస్తోంది..” ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఆటగాళ్ల కంటే కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ బాధ్యుడు అజిత్ అగార్కర్ కు తలనొప్పి వ్యవహారం లాగా మారింది. దీనిపై వారు తీవ్రంగా కసరత్తు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. బహుశా రెండు మూడు రోజుల్లో దీనిపై వారు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.