Team India schedule
Team India schedule : ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే వారు కూడా తమ రిటైర్మెంట్ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. పైగా రవీంద్ర జడేజా కూడా ఎటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదని తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా విన్నవించాడు. మొత్తానికి దిగ్గజ ఆటగాళ్లు తాము రిటైర్ కావడం లేదని స్పష్టం చేశారు. ఇక టీమిండియా 2027లో వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే) ఆడాల్సి ఉంటుంది. ఇక వన్డే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే.. టీమిండియా 2027 వరల్డ్ కప్ నాటికి 24 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో టీమిండియా మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఒక్కో జట్టుతో మూడేసి వన్డేలు భారత్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై వారి సొంతం మైదానాలలోనే టీమ్ ఇండియా తలపడాల్సి ఉంది.
Also Read : భయంకరమైన బ్యాటర్లు ఎంతమందున్నా.. మిస్టర్ ఐసీసీ కోహ్లీనే.. ఎందుకంటే?
అప్పటిదాకా ఆడతారా
టీమిండియా 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి 24 వన్డే మ్యాచ్లు ఆడవాల్సి ఉంది. 2027లో వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, నమీబియా, కెన్యా వేదికగా జరుగుతుంది. ఈ మైదానాలు అచ్చి వచ్చినవే. 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ను టీ మీడియా సాధించింది. 2003లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా వేదిక జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోగా.. ఫైనల్ మ్యాచ్లోను ఓటమిపాలైంది. ఇక 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. 2023 లోనే జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోనూ భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ రెండు కూడా రోహిత్ కెప్టెన్సీ లోనే కావడం విశేషం. అయితే వీటన్నింటికీ 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ద్వారా దీటైన జవాబు చెప్పాలని రోహిత్ భావిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 35 సంవత్సరాలు. తన 39వ ఏట వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది. మరి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ విఫలమయ్యాడు. విరాట్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. మరి అలాంటప్పుడు వీరిద్దరూ అన్ని సంవత్సరాల పాటు క్రికెట్ ఆడగలరా? రాణించగలరా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
Also Read : మీకో దండం రా బాబూ.. ఇండియన్ క్రికెటర్లను ఇలా చేశారేంట్రా?!