WPL Mega Action: ఒకప్పుడు క్రికెట్ అంటే టెస్ట్ మాత్రమే.. ఆ తర్వాత వన్డే ఫార్మేట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు t20 క్రికెట్ మొత్తాన్ని ఊపేస్తోంది. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లు మాత్రమే కాకుండా.. దేశీయంగా ఆయా క్రికెట్ మేనేజ్మెంట్లు t20 టోర్నీలను నిర్వహిస్తున్నాయి. 2008లో ఐపీఎల్ కు శ్రీకారం చుట్టిన బీసీసీఐ.. లక్షల కోట్ల ఆదాయాన్ని అందుకుంది. అదే కాదు తన బ్రాండ్ వ్యాల్యూ ను, ఐపీఎల్ వేల్యూను విపరీతంగా పెంచింది. ఎంతోమంది క్రీడాకారులకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించింది. ప్రస్తుతం టీమిండియాలో ఆడుతున్న మెజారిటీ క్రికెటర్లు మొత్తం ఐపిఎల్ లో సత్తా చూపించినవారే.
మగవాళ్లకు మాత్రమే కాకుండా, కొద్ది సంవత్సరాలుగా బీసీసీఐ ఆడవాళ్లకు కూడా t20 లీగ్ నిర్వహిస్తోంది. దానికి ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టింది. ఐపీఎల్ మాదిరిగానే ఇందులో కూడా నిబంధనలు విధించడం ప్రారంభించింది. మగవాళ్ళ మాదిరిగా కాకపోయినప్పటికీ ఆడవాళ్లకు కూడా తమ స్థాయికి తగ్గట్టుగానే ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఆస్ట్రేలియా నుంచి దక్షిణాఫ్రికా వరకు ఉమెన్ క్రికెటర్లు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ కు సంబంధించి ప్లేయర్లను కొనుగోలు చేసే ప్రక్రియకు గురువారం బిసిసిఐ శ్రీకారం చుట్టుముంది. 277 ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో మొత్తం 194 మంది భారత ప్లేయర్లు ఉండడం విశేషం.
టీమిండియా మహిళా వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఈ వేలానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన దీప్తి శర్మ, రేణుక మీద అందరి దృష్టి ఉంది. ఓల్వార్డ్ కు భారీ ధర పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు జరిగే మెగా వేలంలో దియా యాదవ్(16), భారతి సింగ్(16) తక్కువ వయసు ఉన్న ప్లేయర్లు, 37 సంవత్సరాల వయసుతో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ సబ్నిమ్ ఉన్నారు.
మెగా వేలంలో దీప్తి శర్మకు భారీ ధర పలికే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. దీప్తి శర్మ టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు రేణుక కూడా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంది.. రేణుక కూడా భారీగా ధర పలుకుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈమెను దక్కించుకోవడానికి ముంబై, బెంగళూరు యాజమాన్యాలు పోటీ పడతాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.