Tata IPL 2022: బోణీ కోసం ముంబై.. ఆధిప‌త్యం కోసం రాజ‌స్థాన్‌.. బ‌ల‌బ‌లాలు ఇవే..!

Tata IPL 2022: ఐపీఎల్ లో తిరుగులేని జ‌ట్టు అయిన ముంబై ఇండియ‌న్స్‌కు ఓ సెంటిమెంట్ ఉంది. ఐపీఎల్ ప్ర‌తి సీజ‌న్ లో తొలి మ్యాచ్ ఓడిపోవ‌డం. ఈ జ‌ట్టు తొలి మ్యాచ్ ఓడిపోతేనే ఆ త‌ర్వాతి మ్యాచ్‌లు వ‌రుస‌గా గెలుస్తుంద‌నే సెంటిమెంట్ ను చాలా సార్లు నిజం చేసి చూపించింది. ఈ సీజ‌న్‌లో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొన్న జ‌రిగిన తొలిమ్యాచ్ లో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ మీద ఓడిపోయిన ముంబై.. […]

Written By: Mallesh, Updated On : April 2, 2022 10:45 am
Follow us on

Tata IPL 2022: ఐపీఎల్ లో తిరుగులేని జ‌ట్టు అయిన ముంబై ఇండియ‌న్స్‌కు ఓ సెంటిమెంట్ ఉంది. ఐపీఎల్ ప్ర‌తి సీజ‌న్ లో తొలి మ్యాచ్ ఓడిపోవ‌డం. ఈ జ‌ట్టు తొలి మ్యాచ్ ఓడిపోతేనే ఆ త‌ర్వాతి మ్యాచ్‌లు వ‌రుస‌గా గెలుస్తుంద‌నే సెంటిమెంట్ ను చాలా సార్లు నిజం చేసి చూపించింది. ఈ సీజ‌న్‌లో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొన్న జ‌రిగిన తొలిమ్యాచ్ లో ఓడిపోయింది.

Tata IPL 2022

ఆ మ్యాచ్‌లో ఢిల్లీ మీద ఓడిపోయిన ముంబై.. రెండో సారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతోంది. ఈ సారి రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం తలపడబోతోంది. ఈ సారి ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాల‌ని భావిస్తోంది. ఇక సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ జోరు మీద ఉంది. ఇప్ప‌టికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మీద గెలిచిన హుషారులో ఉన్న రాజ‌స్థాన్‌.. ముంబై మీద కూడా గెలిచి స‌త్తా చాటాల‌ని భావిస్తోంది.

Also Read: Srilanka Crisis: ఆర్థిక సంక్షోభం: శ్రీలంకలో ఎమర్జెన్సీ

వాస్త‌వానికి తొలి మ్యాచ్ లో ఢిల్లీ మీద ముంబై విజయం సాధించేదే.. కానీ చివ‌రిలో లలిత్ ఉపాధ్యాయ్, అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడి ముంబై ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. దీంతో ఈసారి ఎలాగైనా విజ‌య‌కేత‌నం ఎగ‌రేయాల‌ని భావిస్తోంది ముంబై. ఇక ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మ‌ధ్య పోరు సాగ‌నుంది.

అయితే ఈ సారి ముంబైలోకి సూర్యకుమార్ రావ‌డంతో కొంత బ‌లంగా క‌నిపిస్తోంది. అత‌ను మిడిల్ ఆర్డ‌ర్ లో ఉండ‌టం ముంబైకు క‌లిసి వ‌చ్చే అంశం. గాయం కారణంగా మొద‌టి మ్యాచ్‌కు దూరంగా ఉన్న సూర్యకుమార్.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఉన్న అన్మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో సూర్యకుమార్ ను ఆడించాల‌ని ముంబై భావిస్తోంది.

Tata IPL 2022

ఇక రాజ‌స్థాన్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా ప‌టిష్టంగా ఉన్నాయి. జోస్ బట్లర్‌, కెప్టెన్ సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ లాంటి వారితో బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా క‌నిపిస్తోంది. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి అద్భుత ఆట‌గాళ్లు ఉన్నారు. ఈ రెండు జ‌ట్ల న‌డుమ ఇప్ప‌టి వ‌ర‌కు 25 మ్యాచ్ లు జ‌రిగాయి. ఇందులో ముంబై 13 గెలుపొందగా.. రాజస్థాన్ రాయల్స్ 11 గెలిచింది. ఒక‌టి టైగా మిగిలింది.

Also Read: Ramadan: రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నారా.. ఈ ఆహారాలను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు?

Tags