T20 World Cup: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు ఉత్కంఠగా మారింది. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్.. గ్రూప్ 2 నుంచి పాకిస్తాన్ జట్లు ఇప్పటికే సెమీస్ కు చేరాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆస్ల్రేలియా, సౌతాఫ్రికాలు గ్రూప్ 1 నుంచి సెమీస్ రేసులో హోరాహోరీ తలపడుతున్నాయి. ఇందులో గెలిచిన జట్లు ఇంగ్లండ్ తోపాటు సెమీస్ చేరుతాయి.

ఇక మన టీమిండియా ఉన్న గ్రూప్ 2లో న్యూజిలాండ్ కు అందరికంటే చాన్స్ ఎక్కువగా ఉంది. న్యూజిలాండ్-అప్ఘనిస్తాన్ మ్యాచ్ లో విజేత ఎవరన్నది సెమీస్ బెర్త్ ను డిసైడ్ చేస్తుంది. ఇందులో న్యూజిలాండ్ గెలిస్తే ఆ జట్టు నేరుగా సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం టీమిండియాకు ఛాన్స్ ఉంది. అప్ఘన్, న్యూజిలాండ్, టీమిండియా నెట్ రన్ రేట్ ఆధారంగా మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది.
శనివారం గ్రూప్ 1 నుంచి ఏ జట్టు సెమీస్ చేరనుందో తెలుస్తుంది. వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. ఇక ఇంగ్లండ్ పై సౌతాఫ్రికా గెలిస్తే ఆ జట్టు కూడా రన్ రేట్ ఆధారంగా సెమీస్ చేరుతుంది. ఏదీ ఓడినా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు ఇంటికే.
ఇక ఆదివారం 3.30 జరిగే న్యూజిలాండ్ -అప్ఘనిస్తాన్ టీం పోటీలో గెలుపుపై గ్రూప్ 2 సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంటుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒత్తిడి అంతా టీమిండియా కంటే న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్ పైనే ఉండనుంది. ఎందుకంటే ఆ రెండు టీంల కంటే టీమిండియా నెట్ రన్ రేట్ బాగా ఉంది. దీంతో న్యూజిలాండ్ గెలుపు తప్పనిసరి. అందుకే ఒత్తిడి అంతా అప్ఘనిస్తాన్, న్యూజిలాండ్ పైనే అని తాజాగా సీనియర్ క్రికెటర్ సునీల్ గావాస్కర్ అభిప్రాయపడ్డారు. స్కాట్లాండ్ తో భారీ విజయంతో టీమిండియా రేసులోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు.