Homeక్రీడలుT20 World cup : టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాలి!

T20 World cup : టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతం జరగాలి!

T20 World cup : తమ పేలవ ఆటతీరుతో.. ఒకనాటి సైకిల్ స్టాండ్ ట్యాగ్ లైన్ ను మళ్లీ గుర్తుకు తెచ్చిన టీం ఇండియా.. రెండో దారుణ పరాజయంతో సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. పాకిస్తాన్ చేతిలో పది వికెట్ల ఓటమిని మరిపిస్తారని ఆశిస్తే.. కివీస్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. దీంతో.. భారత ఆటగాళ్లు మిగిలిన ఆట ఆడేసి, తట్టా బుటా సర్దుకొని విమానం ఎక్కడమే తరువాయి అన్నట్టుగా ఉంది. అయితే.. ఒకేఒక ఆశనో, అత్యాశనో మాత్రం మిగిలి ఉంది.

నిజానికి.. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభం ముందు పరిస్థితి వేరు. టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది. కానీ.. వరుస రెండు పరాజయాలతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాకిస్తాన్ చేతిలో దారుణ ఓటమి సగటు అభిమాని జీర్నించుకోలేక పోయాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాక్ ను ఓడించినంత పని చేస్తే.. భారత్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. ఆ తర్వాత కివీస్ తో రిజల్ట్ రిపీట్ చేసింది. దీంతో ఇండియా సెమీస్ ఆడటం కష్టంగా మారింది.

అఫ్గానిస్థాన్​ పై విజయంతో గ్రూప్-2 టేబుల్​ టాపర్​గా ఉన్న పాకిస్థాన్ దాదాపు​ సెమీస్​కు చేరినట్లే. అదే సమయంలో టీమిండియా సెమీస్ కు వెళ్లడం కష్టంగా మారింది. అయితే.. కొన్ని అద్భుతాలు జరిగితే టీమిండియా సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా గాలిలో దీపం మాత్రమే. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్​పై గెలిచిన పాక్.. ఇక ఆడాల్సింది చిన్న దేశాలైన స్కాట్​లాండ్, నమీబియా పైనే. కాబట్టి పాక్ బెర్త్ కన్ఫాం అని చెప్పుకోవాలి. మిగిలిన సెమీస్​ బెర్తు కోసం పోరు సాగుతోంది. స్కాట్​లాండ్, నమీబియా జట్లకు అవకాశం లేదని భావించినా.. ప్రధాన పోటీ టీమిండియా, న్యూజిలాండ్​, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉంది.

అయితే.. భారత జట్టు పాక్, న్యూజిలాండ్ పై ఓడిపోవడంతో.. టీమిండియా ఆశలు సన్నగిల్లాయ్. కివీస్ రెండు మ్యాచులు ఆడి, ఒకటి గెలిచింది. దీంతో.. టీమిండియా కన్నా న్యూజిలాండ్ కే సెమీస్ ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. న్యూజిలాండ్ రన్ రేట్ కూడా ప్లస్ లో ఉంది. అఫ్గానిస్థాన్ నెట్ రన్ రేట్ కూడా ప్లస్ లోనే ఉంది. ఇది కూడా టీమిండియాకు ఒక దెబ్బ లాంటిదే. ఇలాంటి పరిస్థితుల్లో.. టీమిండియా సెమీస్ కు వెళ్లాలంటే.. అఫ్గానిస్థాన్ ను భారీ తేడాతో ఓడించాలి. అదొక్కటే చాలదు.. ఆ తర్వాత న్యూజిలాండ్ ను అఫ్గానిస్థాన్ జట్టు చిత్తు చేయాలి. ఈ అద్భుతం జరిగితే తప్ప, భారత్ సెమీస్ చేరడం కష్టమే.

అఫ్గానిస్థాన్​తో కోహ్లీసేన నవంబర్​ 3న తలపడనుంది. కివీస్-అఫ్గాన్ మధ్య నవంబర్​ 7న మ్యాచ్​ జరగనుంది. ఈ రెండు మ్యాచుల తర్వాతే సెమీస్​ చేరే జట్లపై పూర్తి క్లారిటీ రానుంది. మరి, ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular