Team India: టీమిండియా పరాజయాల జోరు కొనసాగిస్తోంది. దీంతో అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. అటు పాకిస్తాన్, ఇటు న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ ల్లో ఓటమి సాధించిన టీమిండియా జట్టు విమర్శలకు గురవుతోంది. రెండు ఆటల్లో ఆడి అపఖ్యాతిని మూటగట్టుకుంది. కోహ్లి సేనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శల దాడి కొనసాగుతోంది. దీంతో టీమిండియాపై అభిమానుల్లో నైరాశ్యం నెలకొంది.

ఈ నేపథ్యంలో యూఏఈ వేదికగా జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓటమితో సెమీస్ అవకాశాలు కోల్పోయాయి. దీంతో కోహ్లిసేనపై ఆగ్రహం పెరిగిపోతోంది. దీనికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారత జట్టుకు అండగా నిలిచాడు. ఆటలో విజయం సాధించాలనే ప్రతి ఆటగాడు బరిలో నిలుస్తాడు కానీ అపజయం కావాలని ఎవరు కోరుకోరని చెప్పాడు.
ఆటగాళ్లు ఆటలో నిలిచినప్పుడు అనుసరించే వ్యూహాలు ఒక్కోసారి తప్పుదారి పడతాయని తెలుస్తోంది. అందుకే ఒక జట్టు ఓటమి పాలయితే మరో జట్టు విజయం సాధిస్తుందని గుర్తు చేశారు. అంత మాత్రాన వారిని చులకన చేసి మాట్లాడటం భావ్యం కాదని సూచించారు. టీమిండియా అభిమానులకు పీటర్సన్ అండగా నిలిచాడు.
న్యూజీలాండ్ తో భారత జట్టు ఓటమికి కారణాలపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సైతం స్పందించాడు. టీమిండియాలో రెండు గ్రూపులున్నాయని గుర్తు చేశారు. అందుకే కోహ్లి సేన పరాజయం పాలైందని చెప్పాడు. విరాట్ కోహ్లి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఆయనో మంచి క్రికెటర్ అని కొనియాడారు.