Homeక్రీడలుక్రికెట్‌T20 World Cup 2026 Schedule: 2026 T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్...

T20 World Cup 2026 Schedule: 2026 T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే

T20 World Cup 2026 Schedule: క్రికెట్‌ ప్రపంచంలో ఫుట్‌బాల్‌ తర్వాత ఎక్కువ మంది చూసే ఆట. క్రికెట్‌ అంటే భారత్, పాకిస్తాన్‌ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో పిచ్చి. వీరాభిమానులు ఉన్నారు. క్రికెటర్లకు అయితే ప్రత్యేకంగా ఫ్యాస్స్‌ అసోసియేషన్స్‌ కూడా ఉన్నాయి. ఇక ప్రతీ టోర్నీని చాలా దేశాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. అయితే కొన్నేళ్లుగా పొట్టి క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. వన్డే, టెస్టుకు ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో నేటితరం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. భారత్, శ్రీలంగా సంయుక్తంగా 2026 టీ20 వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 8న టోర్నీ జరుగుతుంది. 2024 ప్రపంచం కప్‌ విజేతగా నిలిచిన భారత్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.

జంబో టోర్నీ..
ఇక ఈ 2026 టీ20 వరల్డ్‌ కప్‌ జెంబో టోర్నీగా నిలవనుంది. ఈ టోర్నీలో సుమారు 20 జట్లు పాల్గొంటున్నాయి. ఐసీసీ ఈజట్లను నాలుగు గ్రూపులుగా విభజించింది. గత టోర్నీలో చిన్న జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాయ. గతంలో యూఎస్‌ఏ జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నామీబియా, యూఎస్‌ఏ జట్లు గ్రూప్‌ ఏలో ఉన్నాయి.

గ్రూప్‌ బీలో…శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్‌ ఉన్నాయి, అత్యంత సవాలు చేసే గ్రూపుగా ఇది భావించాలి.

గ్రూప్‌ సీలో.. ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల, ఇటలీ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో పోటీ కాస్త తక్కువే. ఇంగ్లండ్, వెస్టిండీ, బంగ్లాదేశ్‌ కీలక జట్లు.

గ్రూప్‌ డీలో ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, కెనడా, యూఏఈ ఉన్నాయి. ఈ గ్రూప్‌ను మరింత కఠినంగా ఉంది.

పోటీ ఇలా..
ప్రతీ గ్రూప్‌ నుంచి టాప్‌ 2 జట్లు సూపర్‌–8 దశలోకి చేరతాయి. అక్కడ కూడా రెండు గ్రూపులుగా విభజన. అక్కడ నుంచే ఉప గ్రూపుల్లో టాప్‌ 2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హులవుతాయి. సెమీఫైనల్స్, ఫైనల్స్‌ అతి ప్రముఖ ఆందోళనలు కలిగిస్తాయి, ప్రత్యేకించి భారత–పాక్‌ గేమ్స్‌. సెమీఫైనల్స్, ఫైనల్స్‌ వేదికలు పాక్షికంగా పాకిస్తాన్‌ ప్రగతిపై ఆధారపడి ఉంటాయి. పాకిస్తాన్‌ విజయం ఉంటే కొలంబోలో జరుపుకుంటాయి, లేకపోతే హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

భారత మ్యాచ్‌తో ఆరంభం..
భారతదేశం ముంబయి వేదికగా యూఎస్‌ఏతో 7 ఫిబ్రవరి మొదటి మ్యాచ్‌ ఆడుతుంది. ఇది భారత జట్టు కెప్టెన్సీ, ఫిట్‌నెస్‌ను పరీక్షించడం కోసం చాలా ముఖ్యమైన మ్యాచ్‌గా భావించబడుతుంది. ఇతర భారీ మ్యాచ్‌లు భారత్‌–పాకిస్థాన్‌ (15 ఫిబ్రవరి), ఆస్ట్రేలియా, వెస్టిండీస్, మరియు ఇతర ప్రముఖ జట్ల మధ్య ఉంటాయి.

2026 టీ20 వరల్డ్‌ కప్‌ సవాళ్లు, ప్రతిది, సహజంగానే ఆసక్తులు కలిగించేలా ఉంది. ప్రతీ గ్రూపులో ప్రత్యేకమైన సవాళ్లు, ఆటగాళ్ల పరిశీలన ఉంటాయి. భారత జట్టుకు తొలుత యూఎస్‌ఏతో ప్రారంభం కావడం, ఆ తర్వాత భారీ ప్రత్యర్థులతో తలపడటం సాధారణం.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular