T20 World Cup 2022 Semi Finals: టీ20 వరల్డ్ కప్ తుది సమరానికి చేరువవుతోంది. ఇంకా మూడు మ్యాచ్ ల దూరంలోనే ఉంది. దీంతో మ్యాచ్ ల నిర్వహణపై వరుణుడి ప్రభావం ఉంటుందేమోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్ కు చేరగా గ్రూప్ 2 నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్లు చేరాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ల నిర్వహణ కొనసాగుతాయా? లేక వర్షం విలన్ గా మారుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు ఇంటి ముఖం పట్టడం గమనార్హం. క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు. చిన్న దేశమైనా పెద్ద దేశాన్ని మట్టి కరిపించొచ్చు. దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలు కావడం ఇదే కోవలోకి వస్తుంది.

ఆస్ట్రేలియా సైతం తన స్వయంకృతాపరాధంతో సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ తో న్యూజిలాండ్ పోటీ పడనుంది. నవంబర్ 10న అడిలైడ్ లో రెండో సెమీఫైనల్ లో ఇంగ్లండ్ తో పాకిస్తాన్ ఆడనుంది. దీంతో వరుణుడు మ్యాచ్ లకు అడ్డు పడితే పరిస్థితి ఏంటనే దానిపైనే అందరికి ఉత్కంఠ నెలకొంది. వర్షంతో సూపర్ 12 లో కొన్ని మ్యాచ్ లు రద్దు కాగా దీంతోనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టాయి. సెమీ ఫైనల్ లో కూడా వర్షం ఇలా అడ్డుపడితే మ్యాచ్ లు రద్దయితే ఎలా అని డౌట్ వస్తోంది.
సెమీ ఫైనల్స్ లో వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డేలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ రోజు వర్షం పడితే మరుసటి రోజు అదే ఆటను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం విలన్ గా మారినా జట్లకు ఎలాంటి ముప్పు ఉండదని తేలిపోతోంది. అనివార్య కారణాల వల్ల వర్షం పడితే మ్యాచ్ ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడి నుంచి మరుసటి రోజు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇక మ్యాచ్ లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిసిపోతోంది.

షెడ్యూల్, రిజర్వ్ డే రెండు రోజుల్లో వర్షం పడిన సందర్భాల్లో కనీసం ఐదు ఓవర్ల చొప్పున ఆటను కొనసాగించేందుకు అంపైర్లు చర్యలు తీసుకుంటారు. అలా కుదరకపోతే గ్రూప్స్ లో టాపర్స్ గా నిలిచిన జట్లు ఫైనల్ కు చేరతాయి. వర్షం పడొద్దనే అందరు కోరుకుంటున్నారు. అన్ని జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సందర్బంలో వర్షం పడితే మ్యాచ్ లు రద్దయితే ఫలితం వేరుగా ఉంటుంది. అందుకే వర్షం పడి మ్యాచ్ ల ఫలితాన్ని అనూహ్యంగా మార్చకూడదనే అందరు ఆశిస్తున్నారు.
వర్షం వల్ల కివీస్ వర్సెస్ పాక్ సెమీస్ మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా జరగకపోతే కివీస్ ను విజేతగా నిర్ణయిస్తారు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ కూడా అలాగే జరిగితే భారత్ ను విజేతగా ప్రకటిస్తారు. దీంతో సెమీ ఫైనల్ కు వర్షం అడ్డంకిగా మారొద్దనే అభిమానులు కోరుకుంటున్నారు.