Virat kohli: దరిద్రం తలమీద నాట్యమాడినట్టు ప్రపంచకప్ టీ20 ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీకి ఏదీ కలిసి రాలేదు. ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి ఎలా ఓడిపోయామో చూశాం. ఇక రెండో మ్యాచ్ న్యూజిలాండ్ తోనూ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. మరింత చిత్తుగా ఓడాడు. దీంతో అందరి ఆగ్రహానికి టీమిండియా గురైంది. టాస్ కీలకమైన దుబాయ్ లో అసలు విరాట్ కోహ్లీ టాస్ గెలవడమే గగనమైంది.

కీలకమైన అప్ఘనిస్తాన్ తో మ్యాచ్ లోనూ అదే కథ. టీమిండియా కెప్టెన్ కోహ్లీ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేశాడు.అయితే రోహిత్, రాహుల్ దంచికొట్టడంతో మ్యాచ్ గెలిచింది.
ఇక కీలకమైన స్కాట్లాండ్ తో మ్యాచ్ లో కోహ్లీకి ఎట్టకేలకు టాస్ గెలిచాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకు గెలిచాడని హమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. బర్త్ డే రోజు టాస్ గెలవడం నిజంగా అదృష్టం అని కోహ్లీ టాస్ గెలిచాక ఆనందం వ్యక్తం చేయడం విశేషం.
యూఏఈ కండీషన్లలో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. పాకిస్తాన్ , న్యూజిలాండ్, ఇంగ్లండ్ లు టాస్ గెలిచి విజయాలు సాధించి ఇప్పుడు సెమీస్ రేసులో నిలిచాయి. వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లు సైతం టాస్ గెలవక ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దశకు చేరాయి. ఎట్టకేలకు విరాట్ కోహ్లీ టాస్ గెలవడం టీమిండియాకు వరంగా మారింది. స్కాట్లాండ్ ను 13 ఓవర్లకే 5 వికెట్లు తీసి మన బౌలర్లు కష్టాల్లోకి నెట్టారు. దీంతో టాస్ ఎంత కీలకమో అర్థమైంది.