Suryakumar Yadav: టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో టీమిండియాలో ప్రముఖ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా స్థానం సంపాదించుకోవడం గమనార్హం. ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. 869 పాయింట్లతో ఫస్ట్ స్థానంలో నిలిచాడు. దీంతో సూర్యకుమార్ దూకుడును ఎవరు అడ్డుకోలేకపోతున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో నిలవడం గమనించదగినదే. ఈ నేపథ్యంలో టీమిండియాకు దొరికిన మరో మంచి బ్యాట్స్ మెన్ గా అతడికి స్థానం దక్కింది.

మహ్మద్ రిజ్వాన్ 830 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. ఇంకా డెవాన్ కాన్వే 779 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ అజామ్ 772 పాయింట్లతో నాలుగో స్థానం, ఐడెన్ మార్కామ్ 748 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇలా సూర్యకుమార్ యాదవ్ తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటి అగ్ర స్థానంలోకి రావడం అభినందించదగినదే. 360 డిగ్రీల బ్యాట్స్ మెన్ గా సూర్యను కీర్తిస్తున్నారు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులు తిరగరాస్తున్నాడు.
సూర్య ఆటతీరుకు అందరు ఆశ్చర్యపోతున్నారు. బౌలర్ ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అతడికి కచ్చితమైన అభిప్రాయం ఉన్నట్లుగా చెలరేగి ఆడుతున్నాడు. సూర్య కుమార్ బ్యాటింగ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యంలా సూర్య మారిన సంగతి తెలిసిందే. దీంతో అతడి బ్యాటింగ్ ను చూడటానికి అందరు ఇష్టపడుతున్నారు. సొగసైన షాట్లతో బౌండరీలు, సిక్సులు బాదుతూ జోరు కొనసాగిస్తున్నాడు. మిడిలార్డర్ లో వచ్చి చివరి వరకు క్రీజులో ఉంటూ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతున్నాడు. కొట్టిన ప్రతి బంతి అయితే బౌండరీ లేదంటే సిక్సుల మోత మోగిస్తున్నాడు.

టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సూర్య తన బ్యాట్ తో విన్యాసాలు చేశాడు. బాల్ ను లేపుతూ ఫోర్ , సిక్సులు బాదాడు. దీంతో జింబాబ్వే బౌలర్లు నోరెళ్లబెట్టారు. అతడిని ఔట్ చేయాలని ఎంత ప్రయత్నించినా వారికి దొరకలేదు. ప్రస్తుతం రేపు జరిగే ఇంగ్లండ్, ఇండియా సెమీస్ లో కూడా సూర్య సత్తా చాటాలని అందరు ఆశిస్తున్నారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ నెగ్గాలని భావిస్తున్నారు. అభిమానుల్లో కూడా అంచనాలు పెరుగుతున్నాయి. సో సూర్య కుమార్ యాదవ్ మన టీమిండియాలో ప్రముఖ బ్యాటర్ గా పేరు తెచ్చుకోవడం గమనార్హం.