Surya Kumar Yadav Captaincy: మైదానంలో దిగితే చాలు బంతిని కసికొద్ది కొడతాడు. ప్రారంభం నుంచి చివరి వరకు దుమ్ము రేపుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పరుగుల ప్రవాహం కొనసాగిస్తాడు. బంతిని మైదానంలో 360 డిగ్రీలలో పరుగులు పెట్టిస్తాడు. సూర్య కుమార్ యాదవ్ గురించి.. అతడు బ్యాటింగ్ చేసే విధానం గురించి రాయడానికి ఇలాంటి ఉపోద్ఘాతమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఆ మెరుపులు లేవు.. ఆ విస్ఫోటనం అంతకంటే లేదు.. ఒక ముక్కలో చెప్పాలంటే సూర్య కుమార్ యాదవ్ మునుపటి మాదిరిగా లేడు. అతడు భాస్వరం లాగా మండే ఇన్నింగ్స్ ఆడటం లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు.. అతడి నాయకత్వంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ లు గెలుస్తున్నప్పటికీ.. వ్యక్తిగతంగా అతని ప్రదర్శన ఏమాత్రం బాగుండడం లేదు.
Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన నిజం…
సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అంత గొప్పగా ఆడడం లేదు.. స్లో పిచ్ ల మీద పరుగులను ప్రవాహం లాగా సాగించే అతడు.. తేలిపోతున్నాడు. గడిచిన 18 ఇన్నింగ్స్ లలో సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ చేయలేదంటే అతడు ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోలేకపోతున్నాడు.. స్పిన్నర్లను తట్టుకోలేకపోతున్నాడు.. కనీసం దూసుకొచ్చే బంతులను ఎదురుకోలేకపోతున్నాడు.. నిర్లక్ష్యపూరితమైన షాట్ లు ఆడి మూల్యం చెల్లించుకుంటున్నాడు.. అతడు అలా అవుట్ కావడం వల్ల టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోతోంది. వరుస వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ ఆర్డర్ మార్చినప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ మాత్రం మారలేదు.. పరుగులను చేయడం కాదు కదా.. కనీసం మైదానంలో నిలబడే సాహసం కూడా సూర్యకుమార్ యాదవ్ చేయలేకపోతున్నాడు.
సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్లో విఫలమవుతున్న నేపథ్యంలో.. అతడి కెప్టెన్సీ గురించి ఇటీవల చర్చ మొదలైంది. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో గిల్ ను సారధిగా నియమిస్తారని చర్చ కూడా జరిగింది.. కోచ్ గౌతమ్ గంభీర్ ఆ విధంగానే ఆలోచిస్తున్నాడని ప్రచారం కూడా మొదలైంది.. అయితే గిల్ అంతగా ఆకట్టుకోవడం లేదు కాబట్టి సూర్య కుమార్ యాదవ్ ను మార్చే అవకాశం లేదని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సూర్య తన ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సూర్య నాయకత్వంలో టీమిండియా నాలుగు ద్వైపాక్షిక సిరీస్ లు సొంతం చేసుకున్నప్పటికీ.. వ్యక్తిగతంగా అతని ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. అతడు ఆడుతున్న ఆట తన స్థాయిది అసలు కాదు. సూర్య ఇలానే ఆడితే మాత్రం త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్లో టీమ్ ఇండియాకు కొత్త సారధి వస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.