Suryakumar Yadav: అర్షదీప్ సింగ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్.. వైరల్ వీడియో…

సూర్య కుమార్ యాదవ్ పైన మరి కొంతమంది మరికొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. ఆయన కెప్టెన్ అయినప్పటినుంచి ప్లేయర్లని సరిగ్గా చూడలేదు అంటూ ప్లేయర్ల పైన కొంచెం ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : December 16, 2023 9:03 am

Suryakumar Yadav

Follow us on

Suryakumar Yadav: ఇండియన్ టీం సౌతాఫ్రికా తో ఆడిన టి20 సిరీస్ ని 1-1 తో ఇండియన్ టీమ్ సమం చేసింది. అయితే ఈ సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అలాగే ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా కూడా సూర్య నిలవడం అనేది విశేషం…

ఇక మూడో టి20 లో సెంచరీ చేసి తను ఒక అద్భుతమైన రికార్డును కూడా నెలకొల్పాడు. ఇలాంటి క్రమంలో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఏమి అవలేదు కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయార్లందరు బస్సులో వెళ్తా ఉంటే సూర్య కుమార్ యాదవ్ మాత్రం అర్షదీప్ సింగ్ పైన తన కోపాన్ని చూపించినట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. సూర్య వేలుని అర్షదీప్ వైపు చూపిస్తూ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే అది మ్యాచ్ కి సంబంధించిన విషయమైతే కాదు, ఏదైనా పర్సనల్ విషయాలకు సంబంధించి కొంచెం కోపానికి వచ్చి ఉండొచ్చు అంటూ పలువురు క్రికెట్ మేధావులు సైతం అభివర్ణిస్తున్నారు.

సూర్య కుమార్ యాదవ్ పైన మరి కొంతమంది మరికొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. ఆయన కెప్టెన్ అయినప్పటినుంచి ప్లేయర్లని సరిగ్గా చూడలేదు అంటూ ప్లేయర్ల పైన కొంచెం ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికి ఆయన ఒకటి రెండు సిరీస్ లకు పరిమితమైన కెప్టెన్ మాత్రమే శాశ్వత కెప్టెన్ అయితే కాదు కాబట్టి ఇప్పుడే ఆయన తన కోపాన్ని ప్లేయర్ల మీద చూపించడం కరెక్ట్ కాదు. ప్లేయర్లకు కూడా క్రికెట్ ఆడటప్పుడైనా బయటైనా పూర్తి స్వేచ్చని ఇవ్వాలి వాళ్లకంటూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వాళ్ళు మ్యాచ్ లో కూడా రాణించగలుగుతారు అంటూ మరి కొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే టి20 మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లను తీసుకోకపోవడం వల్ల సూర్య కుమార్ యాదవ్ ని రాహుల్ ద్రావిడ్ ని ఇద్దరిని కలిపి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. వీళ్లు బాగా ఆడే ప్లేయర్లను తీసుకోరు ఫెలవమైన పర్ఫామెన్స్ ఇచ్చే ప్లేయర్ల ను మాత్రమే తీసుకుంటారు అంటూ వీళ్ళ పైన తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు…ఇక మొత్తానికైతే ఇండియన్ టీమ్ వరుస సీరీస్ లు ఆడుతూ ప్లేయర్లను చాలా బిజీ గా ఉంచే ప్రయత్నం లో బిసిసిఐ ఉన్నట్టుగా తెలుస్తుంది…