Pat Cummins Return IPL 2026: ఇంకెప్పుడు వస్తాడు.. ఎప్పుడు బంతి చేతిలో పట్టుకుంటాడు.. తన స్వింగ్ తో.. ప్రత్యర్థి బ్యాటర్లకు ఎప్పుడు చుక్కలు చూపిస్తాడు.. అతడు లేని లోటు కనిపిస్తూనే ఉంది. అతడు మైదానంలో అడుగు పెడితే మాత్రం 1000 ఏనుగుల బలం వస్తుంది.. అతడు జట్టుకు కావాలి. జట్టుకు బలాన్ని కలిగించాలి. 2024లో కోల్పోయిన ట్రోఫీని.. 2026 లో అందించాలి.. ఇదిగో ఇలానే సాగుతున్నాయి హైదరాబాద్ అభిమానుల ప్రార్థనలు.
హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో నాలుగు గెలిచింది. మూడింట్లో ఓడిపోయింది. ఆ మూడు ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్ లోపం. అతడు గనుక బౌలింగ్ బృందానికి నాయకత్వం వహించి ఉంటే హైదరాబాద్ జట్టుకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ మూడు మ్యాచ్లు కూడా గెలిస్తే కచ్చితంగా హైదరాబాద్ జట్టు టాప్ స్థానంలో ఉండేది. అందువల్లే ఆ బౌలింగ్ లోపాన్ని సవరించడానికి హైదరాబాద్ జట్టు అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. దీంతో గడిచిన మూడు మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించింది. నాలుగు మ్యాచ్లలో విజయాలు అందుకొని నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
హైదరాబాద్ జట్టు ఆస్థాయిలో ఎదురుచూస్తున్న ఆటగాడు మరెవరో కాదు.. హైదరాబాద్ జట్టు ఒకప్పటి కెప్టెన్ కమిన్స్.. కొంతకాలంగా అతడు గాయంతో బాధపడుతున్నాడు. అందువల్లే ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అతడికి ఎన్ఓసి ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ యాజమాన్యం ఇషాన్ కిషన్ ను తాత్కాలిక సారధిగా నియమించింది. అతని ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు నాలుగు విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది.
సోషల్ మీడియాలో కమిన్స్ కీలక పోస్ట్ చేశాడు.. చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత వస్తున్నాను.. రేపు మీతో కలుస్తాను అంటూ అతడు బంతితో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడు రేపు జరిగే మ్యాచ్ లో ఆడతాడని స్పష్టమైంది. అతడు ఆడితే గనక హైదరాబాద్ జట్టు బౌలింగ్ భాగం మరింత బలోపేతం అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ జట్టులో ప్రఫుల్, మలింగ, హర్ష్ వంటి వారు అదరగొడుతున్నారు. వారికి కమిన్స్ తోడైతే హైదరాబాద్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అభిమానులు భావిస్తున్నారు.