Steve Smith : అడిలైడ్ టెస్టులో శతకం సాధించిన హెడ్.. బ్రిస్బేన్ లోనూ అదే ఫామ్ కొనసాగించాడు. భారత బౌలర్ల పై ఎదురుదాడికి దిగుతూ 160 బంతుల్లో 152 పరుగులు చేసి.. అదరగొట్టాడు. స్మిత్ 190 బంతుల్లో 102 పరుగులు చేశాడు. స్మిత్, హెడ్ నాలుగో వికెట్ కు 241 పరుగులు జోడించారు. బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం ఆట ప్రారంభమైన కొంతసేపటికే ఆస్ట్రేలియా టపా టపా మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన స్మిత్, హెడ్ క్రీజ్ లో పాతుకుపోయారు. భారత బౌలర్లను ప్రతిఘటిస్తూ దాటిగా బ్యాటింగ్ చేశారు. స్మిత్ టెస్ట్ స్టైల్లో బ్యాటింగ్ చేయగా.. హెడ్ వన్డే తరహాలో ఆట తీరు ప్రదర్శించాడు. ఇదే క్రమంలో వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరికి బుమ్రా చేతిలో అవుట్ అయ్యారు. సెంచరీ చేయడం ద్వారా స్మిత్ సరికొత్త రికార్డును సృష్టించాడు.
అరుదైన రికార్డ్
గబ్బా మైదానంలో సెంచరీ చేయడం ద్వారా స్మిత్ సరికొత్త ఘనతను అందుకున్నాడు. టెస్టులలో భారత జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 41 ఇన్నింగ్స్ లలో స్టీవెన్ స్మిత్ పది సెంచరీలు పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు 55 ఇన్నింగ్స్ లలో 10 సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు టీం ఇండియా పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్ కొనసాగుతున్నాడు. అతని రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు. కేవలం 41 ఇన్నింగ్స్ లలో స్మిత్ పది సెంచరీలు చేశాడు. స్మిత్, రూట్ తర్వాత స్థానంలో గ్యారీ సోబర్స్ ఉన్నాడు. అతడు 30 ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు చేశాడు. అతడి తర్వాత వివియన్ రిచర్డ్స్ ఉన్నాడు. 41 ఇన్నింగ్స్ లలో 8 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 51 ఇన్నింగ్స్ లలో 8 సెంచరీలు పూర్తి చేశాడు. స్మిత్ కొంతకాలంగా సరైన ఫామ్ లో లేడు. అయితే ఇన్నాళ్లకు తన పూర్వపు లయను అందుకున్నాడు. సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా తనపై వస్తున్న విమర్శలకు బలంగా సమాధానం చెప్పాడు. గబ్బా మైదానంపై తన అసలు సిసలైన టెస్ట్ బ్యాటింగ్ ను భారత బౌలర్లకు రుచి చూపించాడు. చేసింది 101 పరుగులే ఆయనప్పటికీ.. హెడ్ దూకుడుగా ఆడుతుంటే.. స్మిత్ మాత్రం నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. అతడి ఇన్నింగ్స్ లో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి అంటే.. బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. హెడ్ కు సరైన జోడిగా నిలవడంతో భారత బౌలర్ల పాచికలు గబ్బా మైదానంలో పారలేదు.
535 రోజుల తర్వాత..
స్టీవ్ స్మిత్ గత ఏడాది జూన్ లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇంతవరకు మరొక సెంచరీ చేయలేకపోయాడు. బ్రిస్బేన్ టెస్ట్ కంటే ముందు అతడు కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. 535 రోజుల తర్వాత స్మిత్ సెంచరీ చేయడం విశేషం.