Star Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కెరియర్ స్టార్టింగ్ లో హీరో మహేష్ బాబు, వెంకటేష్ తో సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో తన సత్తా చాటుతుంది. 90 స్ లో ఈమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగుతోపాటు హిందీలో కూడా ఎన్నో సూపర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన అందంతో, అభినయంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరోలకు జోడిగా నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో తన సత్తా చాటుతూ కోట్లు సంపాదిస్తుంది. ముఖ్యంగా క్రికెట్ ఐపీఎల్ లో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ను కూడా బీట్ చేసింది. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. ఈమె గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రాజకుమారుడు సినిమాతో ప్రీతి జింటా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన అందంతో అందరిని కట్టిపడేసింది.
Also Read: రిషబ్ పంత్ ను 27 కోట్లు పెట్టి కొన్నది ఇందుకా? ఉండవల్లి అరుణ్ కుమార్ ను పెట్టుకున్నా సరిపోయేది కదా!
ఆ తర్వాత హీరో వెంకటేష్ కు జోడిగా ప్రేమంటే ఇదేరా సినిమాతో మరొకసారి సూపర్ హిట్ అందుకుంది. ప్రీతి జింటా హిందీలో దిల్ సే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈమె క్యా కెహనా, కోయి మిల్ గయా, వీర్ జారా వంటి హిట్ సినిమాలలో నటించి బాగా ఫేమస్ అయ్యింది. కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ తర్వాత 2008లో వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అడుగుపెట్టిన ఏకైక మహిళా జట్టు యజమానిగా ప్రీతిజింటా గుర్తింపు తెచ్చుకుంది. ముగ్గురు భాగస్వాములతో కలిసి ప్రీతిజింతా కింగ్స్ XI పంజాబ్ జట్టులో పెట్టుబడిని పెట్టింది. ఈ జట్టును కొనుగోలు చేయడానికి ఆమె ముగ్గురు భాగస్వాములతో కలిసి దాదాపు 76 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.662 కోట్లను ఖర్చు పెట్టింది. 2022 నాటికి ఈ జట్టు విలువ 925 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఇండియన్ కరెన్సీ లో రూ.7775 కోట్లు.
View this post on Instagram