Odi World Cup 2023: వరల్డ్ కప్ లో రోజుకొక రసవత్తరమైన మ్యాచ్ జరుగుతుంది. నిజానికి ప్రతి టీం లక్ష్యం కూడా వరల్డ్ కప్ కొట్టడమే కావడం తో అన్ని టీమ్ లు విజయం దిశగానే ముందుకు దూసుకెళ్తున్నప్పటికీ అందులో చాలా టీమ్ లు ఓటమి పాలవ్వడం మనం చూస్తూనే ఉన్నాం…ఇక ఇలాంటి క్రమంలో చిన్న చిన్న టీములు ఓడిపోతే పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.కానీ లాస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచి ప్రస్తుతం ఈ టోర్నీ లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీం కూడా వరుస ఓటములను ఎదుర్కొంటూ ఈ వరల్డ్ కప్ లో వాళ్ల సత్తా ఏంటో నిరూపించుకోలేక పోతుంది.
ఇక ఇలాంటి క్రమంలో ఇప్పటికే ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి, మిగిలిన మూడు మ్యాచ్ ల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయం కూడా అర్థం కావడం లేదు. నిజానికి ఇంగ్లాండ్ టీమ్ వరల్డ్ కప్ కి ముందు చాలా స్ట్రాంగ్ టీమ్ గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అభివర్ణించాయి. కానీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది చివరికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫ్గనిస్తాన్ టీమ్ పైన కూడా ఓడిపోవడం అనేది నిజంగా వాళ్ళ పేలవమైన పెర్ఫార్మెన్స్ కి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక కెప్టెన్ గా బట్లర్ చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. ఇంతకుముందు ప్లేయర్ గా ఉన్నప్పుడు కనీసం రాణిస్తూ టీం కి భారీ స్కోరు అందించడంలో తన వంతు పాత్ర పోషించేవాడు.అయితే ప్రస్తుతం ఆయన బ్యాటింగ్ లో పదును కూడా తగ్గిపోయింది. దాంతో తను కూడా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు. బట్లర్ అనే కాకుండా ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. రీసెంట్ గా సౌతాఫ్రికా మీద జరిగిన మ్యాచ్ లో 170 పరుగులకే అలౌట్ అవ్వడం జరిగింది. ఇక ఈ క్రమంలో ఇంగ్లాండ్ టీమ్ ఈరోజు శ్రీలంక తో ఒక మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోతే ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే…
ఇక ఇంగ్లాండ్ తో తలపడుతున్న శ్రీలంక టీం కూడా సేమ్ పరిస్థితి లో ఉంది. ఒకప్పుడు శ్రీలంక టీం అంటే మహిళా జయవర్ధనే, కుమార సంగక్కర, సనత్ జయసూర్య లాంటి టాప్ క్లాస్ ప్లేయర్ల పేర్లు వినిపించేవి.కానీ ఇప్పుడు శ్రీలంక టీం అంటే పసికూన అయిన ఆఫ్ఘనిస్తాన్ టీం కంటే కూడా చాలా వీక్ గా ఉందనే చెప్పాలి.
ఆఫ్ఘనిస్తాన్ టీమ్ వరుసగా ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి రెండు బలమైన టీంలను ఓడించి అఫ్గాన్ టీమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో వాళ్లకి వాళ్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇక శ్రీలంక టీమ్ మాత్రం ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో గెలిచి మిగిలిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోవడం జరిగింది.ఇక దాదాపుగా ఈ రెండు టీం ల పరిస్థితి కూడా ఒకేలా ఉంది.ఇక ఇలాంటి పరిస్థితిలో ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయిన కూడా సెమీస్ ఆశలను వదిలేసుకోవాల్సిందే.ఇక ఈ హై టెన్షన్ మ్యాచ్ లో ఏ టీం విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది…