Sunrisers Hyderabad: ఈ ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు దూకుడు మీద కనిపిస్తోంది.. జట్టులో ఐకమత్యం ప్రతి సందర్భంలోనూ దర్శనమిస్తోంది. అందువల్లే ఈసారి హైదరాబాద్ జట్టు మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ప్లేయర్లు సూపర్ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్.. బ్యాటింగ్లో సత్తా చూపిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.
ఈ సీజన్లో తొలి మ్యాచ్లో బెంగళూరు చేతిలో హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 65 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.. ఆ తదుపరి మ్యాచ్ లక్నో చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.. అనంతరం జరిగిన మ్యాచ్లో కూడా పంజాబ్ జట్టు చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.. దీంతో ఒక గెలుపు, మూడు ఓటములతో హైదరాబాద్ జట్టు పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకున్నారు. గత ఏడాది ఫలితమే ఈసారి కూడా వస్తుందని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ అప్పుడు హైదరాబాద్ జట్టు తన ఆట తీరు పూర్తిగా మార్చేసుకుంది.
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 57 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 47 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. రాజస్థాన్ ఆర్ ఆర్ జట్టుపై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. వరుసగా ఐదు విజయాలు సాధించి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు పాయింట్లు పట్టికలో ఏకంగా మూడో స్థానంలో కొనసాగుతోంది.
హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు.. క్లాసెన్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.. హెడ్ కూడా టచ్ లోకి వచ్చేసాడు. నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.. బౌలింగ్లో ప్రఫుల్, మలింగ, కమిన్స్ సత్తా చూపిస్తున్నారు. ఫీల్డింగ్ లో కొన్ని క్యాచ్ లు జార విడుస్తున్నప్పటికీ.. అంతిమంగా ఆటగాళ్లు ఏకతాటిమీద ఆడుతున్నారు. అందువల్లే హైదరాబాద్ జట్టు ఈ స్థాయిలో విజయాలు అందుకుంటున్నది. ఇప్పటికైతే ప్లే ఆఫ్ బెర్త్ ను దాదాపుగా ఖాయం చేస్తుంది హైదరాబాద్.
హైదరాబాద్ జట్టు మే 3న కోల్ కతా , మే 6 న పంజాబ్, మే 12 న గుజరాత్, మే 18న చెన్నై, మే 22న బెంగళూరు తో తలపడుతుంది.. వీటిలో పంజాబ్, బెంగళూరు జట్లతో ఇటీవల జరిగిన మ్యాచ్లలో హైదరాబాద్ ఓడిపోయింది.. మిగతా మ్యాచ్లలో హైదరాబాద్ విజయం సాధించింది. జోరు మీద ఉన్న హైదరాబాద్ బెంగళూరుకు, పంజాబ్ జట్లకు ఇచ్చి పడేయాలని బలంగా భావిస్తుంది.