Homeక్రీడలుక్రికెట్‌SRH Poor Bowling Analysis IPL 2026: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ...

SRH Poor Bowling Analysis IPL 2026: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

SRH Poor Bowling Analysis IPL 2026: డ్యూ లేదు. అలాగని బంతులను బౌన్సీ గా వేస్తే ఫలితం వస్తోంది. బెంగళూరు బౌలర్ డఫి అలాగే ఫలితాన్ని సాధించాడు. ఏకంగా మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అదే మ్యాజిక్ హైదరాబాద్ బౌలర్లు రిపీట్ చేయలేకపోయారు. ఫలితంగా 201 పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేక పోయారు.

Also Read: మనిషా.. పక్షా.. ఇలా జరిగిందేంటి?.. షాక్ లో ఇషాన్ కిషన్

శనివారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు ముందుగా బౌలింగ్ చేసింది. డఫీ, భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ వేశారు. అయితే మిగతా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఇషాన్ కిషన్, క్లాసెన్ సూపర్ బ్యాటింగ్ చేశారు. మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. వీరిద్దరూ గట్టిగా నిలబడిన నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఆ రేంజ్ లో స్కోర్ చేయగలిగింది. అయితే ఆ స్కోరును నిలబెట్టుకోవడంలో హైదరాబాద్ జట్టు విఫలమైంది. ముఖ్యంగా బౌలర్లు గల్లీ లెవెల్ లో బౌలింగ్ వేశారు. ఫలితంగా బెంగళూరు బ్యాటర్లు దేవదత్ పడికల్(61), విరాట్ కోహ్లీ (69), రజత్ పాటిదర్ (31) సత్తా చూపించడంతో బెంగళూరు జట్టు 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఫినిష్ చేయడం విశేషం.

బౌలింగ్ లయ అంత గొప్పగా లేదనుకుంటే.. అదనపు బంతులు వేసి ఏకంగా 18 పరుగుల దాకా హైదరాబాద్ బౌలర్లు సమర్పించుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి నుంచి మొదలు పెడితే జయదేవ్ వరకు దాదాపు ఆరుగురు బౌలర్లను హైదరాబాద్ కెప్టెన్ కిషన్ ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. బెంగళూరు ఓపెనర్ సాల్ట్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. దేవదత్.. విరాట్ కోహ్లీ హైదరాబాద్ బౌలర్ల లోపాలు గుర్తించి బీభత్సంగా బ్యాటింగ్ చేశారు.. ఫలితంగా ఈ టోర్నీలో హైదరాబాద్ తొలి ఓటమి ఎదుర్కొంది.

బౌలింగ్ సరిగా లేకపోవడంతో హైదరాబాద్ మేనేజ్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరు లాంటి బలమైన జట్టును ఓడించాలంటే అద్భుతమైన బౌలింగ్ కూర్పు ఉండాలని.. 201 పరుగులు చేసినప్పటికీ.. గెలవలేదంటే అంతకుమించిన దారుణం మరొకటి ఉండదని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, ఈ బౌలింగ్తో ఐపీఎల్ ట్రోఫీ ఎలా సాధిస్తారని.. వెంటనే బ్యాగులు సర్దుకొని ఇంటికి వచ్చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular