Kaviya Maran: ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడల్లా ఓ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. స్టేడియంలో ఆమె ఉన్నదంటే సందడి మామూలుగా ఉండదు. ఇప్పటికే మేము ఎవరి గురించి చెబుతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమెనే నండి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ గురించి.

ఈమె గతంలో అనేక సీజన్లప్పటి నుంచే ఆమె స్టేడయంకు వచ్చి టీమ్ ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆమె ఫొటోలు నెట్టింట్లో ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రెండేండ్ల తర్వాత ఇప్పుడు స్టేడియంలోకి జనాలకు ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ కావ్య పాప స్టేడియంకు వస్తోంది.
Also Read: IPL 2022: ఐపీఎల్: యమ రంజుగా అత్యధిక పరుగులు, వికెట్ల పోటీ.. టాప్ లో వీళ్లే

అయితే ఈ సీజన్‌లో సన్ రైజర్స్ చాలా చెత్త ప్రదర్శనతో ఓడిపోతోంది. అయతే శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి విజయం సాధించి బోణీ కొట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మ్యాచ్ కు కావ్య పాప రాలేదు. దాంతో ఆమె రాకపోతేనే జట్టు గెలుస్తుందని, కావ్య ఈ సీజన్ లో సన్ రైజర్స్‌కు ఐరన్ లెగ్ గా మారిపోయిందంటూ సన్ రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
దీంతో రాబోయే మ్యాచ్ లకు ఆమె రావొద్దని అప్పుడే సన్ రైజర్స్ గెలుస్తుందంటూ వాదిస్తున్నారు. కాగా దీన్ని కావ్య పాప అభిమానులు ఖండిస్తున్నారు. కావ్య గత సీజన్లలో వచ్చినప్పుడు సన్ రైజర్స్ గెలిచింది కదా.. అప్పుడు ఐరన్ లెగ్ ఎందుకు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావ్య పాప కోసమే చాలామందిమి సన్ రైజర్స్ ఆటను చూస్తున్నామని చెబుతున్నారు.
Also Read:Naga Chaitanya: నాగ చైతన్య కి చుక్కలు చూపించిన హైదరాబాద్ పోలీసులు