spot_img
Homeక్రీడలుODI World Cup 2023 : వరల్డ్ కప్ హిస్టరీలోనే అంతటి ఆస్ట్రేలియాకు ఏమిటీ చెత్త...

ODI World Cup 2023 : వరల్డ్ కప్ హిస్టరీలోనే అంతటి ఆస్ట్రేలియాకు ఏమిటీ చెత్త రికార్డ్…

ODI World Cup 2023 : వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి జట్టు కూడా తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ వరుస విజయాలను అందుకుంటుంటే ఆస్ట్రేలియా టీం మాత్రం చాలా దారుణమైన పేలవ పెర్ఫార్మన్స్ ని ఇస్తూ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమిస్ ఆశల మీద నీళ్లు జల్లుకుంటు ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియా నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా టీం మీద 134 పరుగుల భారీ స్కోర్ తేడాతో ఓడిపోయింది.

ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో గత కొన్ని సంవత్సరాల కాలంలో ఇంత భారీ స్కోర్ తేడాతో అయితే ఎప్పుడు ఓడిపోలేదు.1983 లో ఇండియా చేతిలో ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఆ సంవత్సరం ఇండియా వరల్డ్ కప్ సాధించడం జరిగింది.ఇక దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్లీ సౌత్ ఆఫ్రికా టీం మీద ఇప్పుడు 134 పరుగుల భారీ స్కోర్ తేడాతో ఓడిపోవడం అనేది ఆ టీమ్ పేలవమైన ప్రదర్శనకు నిదర్శనం గా కనిపిస్తుంది. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కు ఇది ఒక చెత్త రికార్డు అనే చెప్పాలి. ఇంకా ఇప్పటివరకు ఈ టీం వరల్డ్ కప్ లో నాలుగు సార్లు 200 పరుగుల లోపే అలౌట్ అవ్వడం జరిగింది. గతంలో న్యూజిలాండ్ పైన 151 పరుగులు, అలాగే పాకిస్తాన్ పైన 176 పరుగులు, ఇక మొన్న జరిగిన ఇండియా మ్యాచ్ లో 199, నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో 177 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వరల్డ్ కప్ లో వరుస విజయాలను నమోదు చేసుకొని పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతుంటే ఆస్ట్రేలియా టీం మాత్రం ఒక్క మ్యాచ్ గెలవడానికి నానా తంటాలు పడుతుంది.ఇక వరల్డ్ కప్ కి ముందు ఇండియా తో ఆడిన మూడు వన్డేల సిరీస్ లో కూడా ఇండియన్ టాప్ బ్యాట్స్ మెన్స్ అయిన కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళు లేకపోయినప్పటికీ ఇండియన్ టీం లో ఉన్న జూనియర్ ప్లేయర్స్ తో ఆడిన మ్యాచ్ ల్లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయి అప్పుడే వాళ్ల టీమ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో ప్రపంచానికి తెలియజేసింది.ఇక వరల్డ్ కప్ లో కూడా అదే పేలవమైన పర్ఫామెన్స్ ని కొనసాగిస్తుంది.

ఆస్ట్రేలియన్ టీంలో టాప్ బ్యాట్స్ మెన్స్ అయిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ,మిచేల్ మార్ష్ , గ్లెన్ మాక్స్ వెల్ లాంటి బ్యాట్స్ మెన్స్ ఉన్నప్పటికీ అలాగే బౌలర్లలో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న హజీల్ వుడ్ , స్టార్క్ , కమ్మిన్స్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా టీమ్ మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తుంది.ఇక ఆస్ట్రేలియా సెమీస్ కి వెళ్లే ఆశలు సజీవంగా ఉంచుకోవాలి అంటే ఇకమీదట జరిగే అన్ని మ్యాచ్ లను గెలుచుకుంటూ రావాలి లేకపోతే ఇక్కడున్న పోటీని తట్టుకొని నిలబడడం కష్టం అనే చెప్పాలి…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper
Exit mobile version