Smriti Mandhana Engagement: బాడి కదలికలో రిధం.. వేసే స్టెప్పులో గ్రేస్.. పలికించే హావభావాలలో సరికొత్త విధానం.. అలాగని ఒకటే తీరుగా డాన్స్ వెయ్యలేదు. రోడ్డ కొట్టుడు గా చేతులు ఊపలేదు.. ప్రతి పాటకు తగ్గట్టుగానే డ్యాన్స్ వేశారు. వచ్చిన అతిథులను ఉర్రూతలూగించారు. మామూలుగా అయితే ఇటువంటి పనిని ప్రొఫెషనల్ డ్యాన్సర్లు చేస్తారు. కానీ ఇక్కడ మహిళా క్రికెటర్లు ఆ పని చేశారు. మైదానంలో ప్రపంచ కప్ సాధిస్తాం.. వేదిక మీద స్టెప్పులతో అలరిస్తాం అన్నట్టుగా మహిళా క్రికెటర్లు చూపించారు. ఆహుతులను రంజింపజేశారు.
భారత మహిళా క్రికెట్ జట్టులో ఏస్ ప్లేయర్ గా స్మృతి మందాన కొనసాగుతోంది.. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐపీఎల్ లో బెంగుళూరు జట్టును విజేతగా నిలిపింది.. ఇన్ని గంటలు ఉన్న స్మృతి త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఆమె కొంతకాలంగా సంగీత దర్శకుడు ముచ్చల్ తో ప్రేమ బంధం లో ఉంది.. చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వారిద్దరు దానిని మరో స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.. ఇందులో భాగంగానే ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.. ఎంగేజ్మెంట్ వేడుకకు భారత మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. వచ్చిన వారంతా సందడి చేశారు.
ఎంగేజ్మెంట్ కు ముందు మహిళా క్రికెటర్లు డ్యాన్సులతో అదరగొట్టారు. రీచా మొదలుపెడితే డియోల్ వరకు సందడి చేశారు. సంప్రదాయ దుస్తులతో పాటు.. వెస్ట్రన్ వేర్ కూడా ధరించి వేడుకను మరో స్థాయికి తీసుకెళ్లారు.. ప్రఖ్యాత బాలీవుడ్ పాటలే కాకుండా, తెలుగు, తమిళం, మలయాళ పాటలు కూడా స్టెప్పులు వేశారు. కన్నడ పాటలకు రీల్స్ చేశారు. ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. మహిళా క్రికెటర్లు డాన్సులు వేస్తుంటే వచ్చిన అతిథులు కూడా కాళ్లు కదిపారు. వారితోపాటు డాన్సులు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మహిళా క్రికెటర్లు చేస్తున్న డ్యాన్సులు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అవకాశాలిస్తే సినిమా ఇండస్ట్రీని సైతం మహిళా క్రికెటర్లు దున్నేస్తారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.