Virat kohli Vs Anderson : వైరల్ వీడియో – నీ అయ్య జాగీరా.. తిట్టుకున్న కోహ్లీ-అండర్సన్!

నేరుగా యుద్ధం చేత‌గాని వాడు.. అనుస‌రించే ప‌ద్ధ‌తి దొడ్డిదారి. దీన్ని క్రికెట్ ప‌రిభాష‌లో చెప్పాలంటే స్లెడ్జింగ్ అంటారు. అంటే.. తిట్ల దండ‌కం. ప్ర‌త్య‌ర్థి ఆట‌పై దృష్టి పెట్ట‌కుండా అత‌ని చుట్టూ చేరి రెచ్చ‌గొడుతుంటారు. ఏదో ఒక‌టి తిడుతూ.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాడి ఏకాగ‌త్ర దెబ్బ‌తీయ‌డ‌మే ఈ స్లెడ్జింగ్ ల‌క్ష్యం. ఇలాంటి ప‌ని చేయ‌డంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దిట్ట‌. స్లెడ్జింగ్ అనేది త‌మ ఆట‌లో భాగ‌మ‌ని సిగ్గులేకుండా చెప్పుకున్నారు కూడా. వారి త‌ర్వాత ప్లేసులో ఉన్న‌ది ఇంగ్లాండ్ జ‌ట్టు. […]

Written By: Bhaskar, Updated On : August 18, 2021 1:44 pm
Follow us on

నేరుగా యుద్ధం చేత‌గాని వాడు.. అనుస‌రించే ప‌ద్ధ‌తి దొడ్డిదారి. దీన్ని క్రికెట్ ప‌రిభాష‌లో చెప్పాలంటే స్లెడ్జింగ్ అంటారు. అంటే.. తిట్ల దండ‌కం. ప్ర‌త్య‌ర్థి ఆట‌పై దృష్టి పెట్ట‌కుండా అత‌ని చుట్టూ చేరి రెచ్చ‌గొడుతుంటారు. ఏదో ఒక‌టి తిడుతూ.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాడి ఏకాగ‌త్ర దెబ్బ‌తీయ‌డ‌మే ఈ స్లెడ్జింగ్ ల‌క్ష్యం. ఇలాంటి ప‌ని చేయ‌డంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దిట్ట‌. స్లెడ్జింగ్ అనేది త‌మ ఆట‌లో భాగ‌మ‌ని సిగ్గులేకుండా చెప్పుకున్నారు కూడా. వారి త‌ర్వాత ప్లేసులో ఉన్న‌ది ఇంగ్లాండ్ జ‌ట్టు. వీళ్లు కూడా చేత‌గానప్పుడు తిట్ల‌నే న‌మ్ముకుంటారు. ఇటీవ‌ల ముగిసిన రెండో టెస్టులో ఇదే ప‌నిచేశారు ఇంగ్లీష్ ఆట‌గాళ్లు.

రెండో టెస్టులో టీమిండియా అద్భుత‌మైన ఆట‌తీరుతో ఇంగ్లండ్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ టెస్టులో రెండు జ‌ట్ల ఆట‌గాళ్ల మ‌ధ్య మాట‌ల యుద్దం కూడా కొన‌సాగింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్ లో లాస్ట్ బ్యాట్స్ మెన్ గా వ‌చ్చిన అండ‌ర్స‌న్ ను.. బుమ్రా ప‌దునైన బంతుల‌తో ఇబ్బంది పెట్టాడు. ఈ క్ర‌మంలోనే అండ‌ర్సన్ ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో అత‌ని భుజం త‌ట్టిన బుమ్రా న‌వ్వుతూ ముందుకు వెళ్లాడు. దీనికి తీవ్ర ఆగ్ర‌హానికి గురైన అండ‌ర్స‌న్ బుమ్రాను దుర్భాష‌లాడాడు. ఇదే విధంగా కోహ్లీపైనా నోరు జారాడు. దీంతో.. విరాట్ ధీటుగా బ‌దులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

భార‌త్ ఇన్నింగ్స్ లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండ‌గా.. ప‌దే ప‌దే పిచ్ పై న‌డుస్తూ అడ్డు వ‌చ్చేందుకు ట్రై చేసిన అండ‌ర్స‌న్ స్లెడ్జింగ్ కు సైతం తెర‌తీశాడు. దీంతో.. కోహ్లీ ఎందుకు సైలెంట్ గా ఉంటాడు? ధీటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘బూమ్రాను తిట్టిన‌ట్టు మ‌ళ్లీ న‌న్ను తిడుతున్నావా?’’ అని కోహ్లీ అనడంతో.. ‘‘నువ్వు కూడా నన్ను కావాల్సినంత తిట్టుకో’’ అంటూ సమాధానం ఇచ్చాడు అండర్సన్.

ఈ సమాధానంతో మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోహ్లీ.. ‘‘నువ్వు నీ సొంత రూల్స్ ప్రకారం ఆడుతున్నావు. నన్ను బూతులు తిడుతున్నావు. నీ అయ్య జాగీరన్నట్టు పిచ్ పై పరిగెడుతున్నావ్.. హా..? అని అరిచాడు. దీనికి అండ‌ర్స‌న్ వెట‌కారంగా బదులిచ్చాడు. ‘‘నాకు తెలిసి బౌలర్లు క్రీజు వరకు పరిగెడతారు’’ అంటూ సమాధానం ఇవ్వడంతో.. ‘‘ముసలోడివి అయిపోయావు కదా.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్’’ అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలన్నీ స్టంప్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.