India England Test Siraj Bowling: అలసట లేదు. ఒత్తిడి లేదు. భయం అనేది లేదు. మాటకు మాట.. ప్రత్యర్థి ఆటగాడు నోరు జారితే బంతితో సమాధానం చెబుతాడు. ఇంకా ఎక్కువ తక్కువ చేస్తే నోటితోనే బదులు చెబుతాడు. ఇది స్థూలంగా హైదరాబాదీ సిరాజ్ స్టైల్.
టీమిండియాలో విరాట్ కోహ్లీ లేని లోటును అతడు తీర్చుతున్నాడు. మామూలుగా కాదు అగ్రెసివ్ ఆటతో అదరగొడుతున్నాడు. సాధారణంగా టీమ్ ఇండియాలో రేసుగుర్రం అంటే బుమ్రా పేరు చెబుతారు. జట్టుకు వికెట్ కావలసి వచ్చినప్పుడు కెప్టెన్ బుమ్రా వైపు చూస్తాడు. అయితే కొద్దిరోజులుగా తీరికలేని ఆట తీరుతో బుమ్రా అలసిపోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు సిరాజ్.. తిరుగులేని స్థాయిలో బౌలింగ్ వేస్తూ.. అదిరి పోయే రేంజ్ లో వికెట్లు పడగొడుతూ.. తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్నాడు సిరాజ్. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో నిర్విరామమైన క్రికెట్ ఆడాడు. ఏకంగా 130+ ఓవర్లు వేసి.. 24+ వికెట్లు తన ఖాతాలో వేసుకొని జట్టు సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు.. ముఖ్యంగా లండన్ ఓవల్ మైదానంలో జరిగిన ఐదవ టెస్ట్ ఇంగ్లాండ్ చివరి ఇన్నింగ్స్ లో సిరాజ్ తన విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఐదో రోజు ఆటలో ఏకంగా మూడు వికెట్లు సాధించి.. టీమిండియా కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
లండన్ ఓవల్ టెస్టులో
వాస్తవానికి ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 35 పరుగులు చేయాలి. టీమిండియా నాలుగు వికెట్లు సాధించాలి. ఈ దశలో సిరాజ్ బౌలింగ్ భారాన్ని మొత్తం తను మాత్రమే మోసాడు. అత్యంత పదునైన బంతులు వేస్తూ మూడు వికెట్లు తీయడం మాత్రమే కాదు..బ్రూక్ క్యాచ్ మిస్ చేసిన అపప్రదను దూరం చేసుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా రేసుగుర్రం ఎవరంటే బుమ్రా పేరు వినిపించేది. ఇకపై ఆస్థానాన్ని సిరాజ్ ఆక్రమించినట్టే.
Also Read: విడాకుల విషయంలో సైనా కీలక నిర్ణయం.. కశ్యప్ ను ఉద్దేశించి సంచలన ప్రకటన..
సిరాజ్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ వేస్తాడు. ఎంతటి కఠినమైన వాతావరణం లోనైనా బంతిని వేగంగా విసురుతాడు. తన వల్ల కాదు.. తనకు ఆరోగ్యం బాగోలేదని ఏమాత్రం చెప్పడు. ఉదాహరణకు లండన్ ఓవల్ టెస్టులో సిరాజ్ ఏకంగా 46 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడంటే.. అతడి సామర్థ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి సుదీర్ఘమైన స్పెల్ వేసినప్పటికీ సిరాజ్ ఏమాత్రం తన లయను కోల్పోలేదు. పైగా అత్యంత కట్టుదిట్టమైన బంతులు వేసి టీమిండియా కు అద్భుతమైన విజయాన్ని అందించాడు..