Homeక్రీడలుక్రికెట్‌Gill Telugu Video: "బాల్ రా మామ, బాగుందిరా మామ.." కోడ్ భాష ఇప్పుడు తెలుగు..

Gill Telugu Video: “బాల్ రా మామ, బాగుందిరా మామ..” కోడ్ భాష ఇప్పుడు తెలుగు..

* వైరల్ అవుతున్న గిల్ తెలుగు
* ఇప్పుడు కోడ్ భాష తెలుగునా..?
* ప్రత్యర్థి జట్టు సభ్యులను గందరగోళం చేసేందుకు ఇండియన్ క్రికెటర్లు తెలుగును ఎంచుకున్నారా.?

Gill Telugu Video: ఓవల్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఇండియన్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్ తో ఇద్దరు ఓపెనర్ల ను ఔట్ చేశాడు. నితీశ్ మంచి బాల్ వేసినప్పుడు స్లిప్ లో ఫీల్డ్ చేస్తున్న కెప్టెన్ గిల్ “బాల్ రా మామ” అని అరవడం, వికెట్ తీసినప్పుడు “బాగుందిరా మామ” అని గట్టిగా అరవడం స్టంప్ కెమెరా నుంచి వినిపించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పంజాబ్ కు చెందిన కెప్టెన్ శుభమన్ గిల్ ఫీల్డులో తెలుగులో మాట్లాడడం తెలుగు క్రికెట్ వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు, విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియో క్లిప్ ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇండియా జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లు ఆడుతున్నారు. అయితే సాధారణంగా ఒకరికొకరు మాట్లాడుకునే భాషల్లో ఎక్కువగా హిందీ, అవసరమైనప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. అయినప్పటికీ చాలా మంది ఆటగాళ్ళు మరాఠీ, తమిళం, పంజాబీ, గుజరాతీ వంటి వారి మాతృభాషలను కూడా మాట్లాడతారు.

Also Read: రోహిత్ కు షాక్ లగా.. వన్డే జట్టు కెప్టెన్ గా గిల్.. టీమిండియాలో ఏం జరుగుతోంది?

వ్యూహ రచన చేసేప్పుడు..
అయితే ఆట వ్యూహాలను చర్చించేటప్పుడు అందరికీ అర్థమయ్యే హిందీ భాష లో మాట్లాడుకోవడం సర్వసాధారణం.ఒకే రాష్ట్రానికి చెందిన సన్నిహిత సహచరులతో తమ మాతృభాషలో మాట్లాడుతారు. కెప్టెన్ కు ఫీల్డ్ లో ఎక్కువగా బౌలర్ల తో సత్సంబంధాలు ఉండడం ప్రధానం. వారితో కలివిడిగా ఉండడానికి ప్రధానమైంది వారి భాషలో మాట్లాడడం, అర్థం చేసుకోవడం. ఏదైనా వ్యూహం వారితో రచించాలంటే వారి భాషలో చెప్పడం, వారిని వారి వాడుక భాషలో ప్రశంసించడంతో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అందుకే పంజాబీ ఆయన గిల్ హైదరాబాదీ భాషలో నితీష్ ను మెచ్చుకున్నాడు. క్రికెట్లో బ్యాటింగ్ తో ఒక జట్టు ఎంత పెద్ద స్కోర్ చేసినా బౌలర్లు రాణించకుంటే సమస్యనే. మొదటి రెండు మ్యాచులు మనకు వాటిని రూడీ చేశాయి. బౌలర్లతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తే వికెట్లు తీయడం, కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును నిలువరించడం సాధ్యమని త్వరగా గ్రహించిన గిల్ ఫీల్డులో అలాగే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అంతకుముందు తాను కెప్టెన్ కాదు కనక ఇది సమస్య కాదు.

సాధారణంగా అందరూవివిధ భాషలలో మాట్లాడటం వలన మెరుగైన అవగాహన పెరుగుతుంది, ముఖ్యంగా సంక్లిష్టమైన ఆట ప్రణాళికలను చర్చించేటప్పుడు, ఆటగాడు తమను తాము స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది తోడ్పడుతుంది.మ్యాచ్‌ల సమయంలో, ఆటగాళ్ళు వ్యూహరచన చేయడానికి లేదా మరింత సహజమైన రీతిలో అభిప్రాయాలు పంచుకోవడానికి వారి మాతృభాషలకు మారవచ్చు. ప్రత్యర్థులు కొత్త ఆటగాళ్ళు జట్టులో చేరినప్పుడు, ప్రతి ఒక్కరూ సూచనలను అర్థం చేసుకునేలా ఆ ఆటగాళ్లతో ఎక్కువ సేపు గడుపుతారు.

కోడ్ భాష ఇప్పుడు తెలుగు..

ప్రత్యర్థి జట్టుకు పరిచయం లేని భాషలో వ్యూహాలను ఎప్పటిటప్పుడు చర్చించుకోవడం, మార్చుకోవడం ఇండియన్ క్రికెట్ లో ఎప్పటినుంచో ఉంది. గతంలో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ తమ ప్రత్యర్థులను గందరగోళపరిచేందుకు మరాఠీని ఉపయోగించినట్లు అంగీకరించారు. గవాస్కర్ సైతం తన రచనల్లో ఈ విషయాన్నీ ఉటంకించారు.అయితే ప్రస్తుతం కోడ్ భాషగా తెలుగును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వివిధ దేశాలతో ఆడెప్పుడూ కోడ్ భాష మారుస్తూ ఉండడం ఒక స్ట్రాటజీ. ఐపీఎల్ మూలంగా వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు మన దేశానికి చెందిన జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయా భాషలను త్వరగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని కోడ్ భాష మారుస్తారు. ఐపీఎల్ లో ఇంగ్లీష్ క్రికెటర్లు మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, బ్రూక్, కార్స్ రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లకు ఆడారు. దాదాపు మూడు నెలలు మన క్రికెటర్లతో వారు మమేకమై ఉన్నారు. అంటే కొద్దో గొప్పో ఆయా ప్రాంతాలకు చెందిన భాషను అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇప్పటివరకు టిపికల్ భాషలుగా చెప్పుకునే
మరాఠీ, కన్నడ, రాజస్తానీ భాషలు వారికి అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే అంతకన్న టిపికల్ భాష తెలుగు, అందులో హైదరాబాదీ తెలుగు మరీ సంక్లిష్టం. అందుకే ఈ భాష ఇంగ్లీష్ జట్టు సభ్యులకు అర్థం కావడం కష్టసాధ్యమని తెలుగులో మాట్లాడుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

-దహగాం శ్రీనివాస్

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version