IND Vs SA: ఏ ముహూర్తంలో బీసీసీఐ టీమిండియాకు గిల్ ను సారధిగా నియమించిందో .. అప్పటినుంచి అతడు దూకుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంగ్లాండ్ గడ్డమీద తనకున్న అపప్రదను తొలగించుకున్నాడు. సెంచరీలతో మోత మోగించాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆ సిరీస్ లో రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో అదరగొట్టాడు.. ఈ సిరీస్ లో కూడా అతడు పరుగుల వరద పారించాడు. దీంతో గిల్ నాయకత్వం మీద టీం ఇండియా మేనేజ్మెంట్ కు ఒక సంపూర్ణమైన నమ్మకం ఏర్పడింది.
అటు ఇంగ్లాండ్ మీద.. ఇటు వెస్టిండీస్ జట్టు మీద సెంచరీలతో కదం తొక్కిన గిల్.. ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. 25 సంవత్సరాల వయసులోనే టీమ్ ఇండియాకు సారధి అయిన గిల్,. ఏకంగా లెజెండరీ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డుకు స్పాట్ పెట్టాడు. ఎందుకంటే ఈ సిరీస్లో గిల్ కనుక మరొక సెంచరీ చేస్తే.. అరుదైన రికార్డును బదులు కొడతాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక చర్యలు చేసిన భారత టెస్టు కెప్టెన్ గా ఆవిర్భవిస్తాడు. ఎందుకంటే ప్రస్తుతం 2025 సంవత్సరంలో గిల్ అత్యధికంగా ఐదు సెంచరీలు చేశాడు. 2017, 2018 కాలంలో విరాట్ కోహ్లీ ఐదు సెంచరీలు చేశాడు. ఈ సిరీస్లో ఒక సెంచరీ గనుక గిల్ చేస్తే ఒక కేలండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్ గా ఆవిర్భవిస్తాడు.
గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మైదానంలో అదిరిపోయే స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో తను ఏమిటో నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండియా కు సరికొత్తగా దిశా నిర్దేశం చేసాడు. అంతేకాదు సిరీస్ అధ్యంతం ఇంగ్లాండు జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి టెస్ట్ ఓడిపోయినప్పటికీ.. రెండో టెస్టులో టీమిండియా గెలిచేలా చేసా. మూడో టెస్ట్ ఇంగ్లాండ్ గెలిచింది. అయితే ఏమాత్రం నిరాశపడకుండా.. నాలుగో టెస్ట్ డ్రా.. అయితే టెస్ట్ గెలవడం ద్వారా ఇంగ్లాండ్ జట్టుకు దిమ్మ తిరిగే విధంగా చేశాడు. పైగా వెస్టిండీస్ జట్టుతో స్వదేశంలో జరిగిన సిరీస్ ను వైట్ వాష్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల్లో కూడా టీమ్ ఇండియాను విజయపథంలో గిల్ నడిపిస్తాడని మేనేజ్మెంట్ నమ్ముతోంది.
గిల్ ఆధ్వర్యంలో టీమిండియా టెస్టులలో అద్భుతమైన ప్రతిభను చూపిస్తోంది. ఒకవేళ దక్షిణాఫ్రికా పై టీమ్ ఇండియా విజయం సాధిస్తే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ర్యాంకింగ్ లు మెరుగవుతాయి. అప్పుడు టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్ అవ్వాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది.