Shubman Gill: టి20 ఫార్మాట్ అనేది వేగానికి నిలువెత్తు కొలబద్ద లాంటిది. ఆటగాళ్లు ఎంత వేగంగా ఆడితే జట్టు విజయా అవకాశాలు అంత బలంగా ఉంటాయి. అందువల్లే టి20 ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి యంగ్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే యువ ఆటగాళ్లు వేగంగా ఆడతారని మేనేజ్మెంట్ నమ్ముతుంది. టి20 అనేది 20 ఓవర్ల మ్యాచ్ కాబట్టి త్వరగా పరుగులు చేస్తే.. లేదా వేగంగా వికెట్లు తీస్తే జట్టుకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ తరహా ప్రణాళికలలో టీమిండియా మేనేజ్మెంట్ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే టెస్ట్, వన్డే విషయంలో ఒకటికి రెండుసార్లు టీమిండియా మేనేజ్మెంట్ ఎక్కువ ఆలోచిస్తుంది. ఇక టి20 విషయానికి వస్తే మరింత లోతుగా ఆలోచిస్తుంది. అందువల్లే జట్టులో ఎక్కువగా యాంగ్ ప్లేయర్లకు అవకాశం ఇస్తుంది..
అయితే ఈసారి జరుగుతున్న ఆసియా కప్ లో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఎందుకనో టెస్ట్ సారధి గిల్ మీద విపరీతమైన ప్రేమ కనపరిచింది. టి20లో అతని రికార్డ్ చెప్పుకునే స్థాయిలో గొప్పగా లేదు. వాస్తవానికి అతని కంటే జైస్వాల్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ గౌతమ్ గంభీర్ ప్రోత్బలంతో గిల్ కు జట్టులో అవకాశం కల్పించారు. వచ్చిన అవకాశాన్ని అతడు ఏమాత్రం వినియోగించుకోవడం లేదు. తొలి మ్యాచ్ లో యూఏఈ పై తొమ్మిది బంతుల్లో 20 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏడు బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు . ఇక పసికూన ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. షా ఫాసిల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు అవుట్ కావడం జట్టు స్కోర్ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. సంజు శాంసన్ కనుక నిలబడకపోయి ఉంటే భారత జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న గిల్ ఇలా అవుట్ కావడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి టి20 ఫార్మాట్లో గిల్ కంటే జైస్వాల్ అద్భుతంగా ఆడుతాడు. అతడి ట్రాక్ రికార్డు కూడా అదే స్థాయిలో ఉంది. ఎందుకనో మేనేజ్మెంట్ అతనికి అవకాశం ఇవ్వడం లేదు. పోనీ గిల్ కు వచ్చిన అవకాశాలను అతడు వినియోగించుకోవడం లేదు. ఆల్రెడీ టీమిండియా ఆసియా కప్ లో సూపర్ 4 లోకి వెళ్లిపోయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇదే మ్యాచ్ గనుక సూపర్ 4 విభాగంలో అయి ఉంటే భారత్ పరిస్థితి ఏమిటి.. అప్పుడు విజయావకాశాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి కదా.. ఇప్పటికైనా గిల్ తన ఆట తీరు మార్చుకోవాలి. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాలి. లేకపోతే అది అనేక రకాల ప్రభావాలకు దారితీస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. శతకాల మోత మోగించాడు. కానీ టి20 విషయానికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాడు. ఈ ఫార్మాట్లో గిల్ తన ఆట తీరును మెరుగుపరచుకోవాలి. సమూలంగా మార్చుకోవాలని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Shubhman Gill is a good player, no doubt!
– But we all agree that Sanju Abhishek as a duo in opening are spot on
– Gill should be adjusted in the XI at a different position rather than opening, you can’t play on the basis of favoritism.#INDvsOMA | Omanpic.twitter.com/2AulLCCas6— Kshitij (@Kshitij45__) September 19, 2025