Yuzvendra Chahal: యజువేంద్ర చాహల్, ధనశ్రీ వ్యవహారం ఇంత రచ్చ రచ్చ అవడానికి కారణం శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అయ్యర్ తో ధనశ్రీ చనువుగా ఉన్న ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దానివల్లే చాహల్, ధనశ్రీ మధ్య వివాదం మొదలైందని.. అది కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారిందని చాహల్ సన్నిహితులు అంటున్నారు. ” చాహల్ ధనశ్రీకి విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చాడు. అపరిమితమైన ఆనందాన్నిచ్చాడు. ఆమెకు విపరీతమైన ప్రాధాన్యాన్ని కల్పించాడు. అప్పటికే ఆమె కొరియోగ్రాఫర్ కావడంతో చాహల్ ద్వారా వచ్చిన ఫేమ్ ను ఉపయోగించుకుంది. ఆమె కూడా సెలబ్రిటీ అయిపోయింది. కానీ ఇప్పుడేమో పరిస్థితి తిరగబడింది. ఇద్దరు విడిపోయే దాకా వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందో తెలియడం లేదు.. కాకపోతే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది అనేది మాత్రం వాస్తవమని” చాహల్, ధన శ్రీ సన్నిహితులు అంటున్నారు. అయితే ఇప్పుడు చాహల్, అయ్యర్, ప్రశాంత్ సింగ్ బిగ్ బాస్ -18 లో కనిపించబోతున్నారు. సండే ఈవెంట్లో వీరు ముగ్గురు సందడి చేస్తారు. వీరు పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బిగ్ బాస్ లో సందడి
శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చాహల్, శశాంక్ సింగ్ బిగ్ బాస్ -18 లో కనిపించనున్న నేపథ్యంలో సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న షో లో వీరు ముగ్గురు సందడి చేయనున్నారు. అయితే సల్మాన్ ఖాన్ చాహల్ – ధనశ్రీ కి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం లేదని.. అలా అయితే ఈ షో మరింత వివాదానికి కారణమవుతుందని విశ్లేషకులు అంటున్నారు..” బిగ్ బాస్ -18 రేటింగ్స్ పెంచుకోవడానికి నిర్వాహకులు ఈ తీరుగా ప్లాన్ చేసి ఉంటారు. ఒకవేళ అది విజయవంతం అయితే వారి ప్లాన్ వర్క్ అవుట్ అయినట్టే.. ప్రస్తుతం మీడియాలో చాహల్ ధనశ్రీ వ్యవహారం రోజుకో తీరుగా మారుతుంది. దానిని క్యాష్ చేసుకునేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. అందువల్లే ఈ ప్రణాళిక రూపొందించింది. ఇది విజయవంతమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే హిందీ మార్కెట్లో ధనశ్రీ కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ చేసింది. కొన్ని రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. అలాంటప్పుడు ధనశ్రీ భర్తగా చాహల్ కు క్రేజ్ ఉంటుంది. పైగా అతడు పేరు పొందిన క్రికెటర్ కూడా. అందువల్లే బిగ్ బాస్ -18 టీమ్ ఈ దారి ఎంచుకుని ఉంటుంది. మెరుగైన రేటింగ్స్ ఖాయమని” విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.