https://oktelugu.com/

Shreyas Iyer: టీమిండియా కెప్టెన్ కావాల్సిన శ్రేయాస్ అయ్యర్.. ఎందుకు ఇలా అయ్యాడు?

Shreyas Iyer: అదృష్టం కలిసి రాకపోతే అంతే. బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది. ఇది అందరి విషయంలో కాదు. కొందరికి దురదృష్టం నీడలా వెంటాడుతుంది. అదృష్టం ఒకేసారి తలుపు కొడితే దురదృష్టం తలుపు తెరిచే వరకు కొడుతుందట. ప్రస్తుతం టీమిండియా స్టార్ గా ఎదగాల్సిన శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. మొదట అందరు టీమిండియాకు కాబోయే కెప్టెన్ అని అభివర్ణించారు. అతడి ఫామ్ కూడా అలాగే కొనసాగింది. కానీ గాయం కారణంగా మూడు నెలలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2022 / 04:20 PM IST
    Follow us on

    Shreyas Iyer: అదృష్టం కలిసి రాకపోతే అంతే. బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది. ఇది అందరి విషయంలో కాదు. కొందరికి దురదృష్టం నీడలా వెంటాడుతుంది. అదృష్టం ఒకేసారి తలుపు కొడితే దురదృష్టం తలుపు తెరిచే వరకు కొడుతుందట. ప్రస్తుతం టీమిండియా స్టార్ గా ఎదగాల్సిన శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. మొదట అందరు టీమిండియాకు కాబోయే కెప్టెన్ అని అభివర్ణించారు. అతడి ఫామ్ కూడా అలాగే కొనసాగింది. కానీ గాయం కారణంగా మూడు నెలలు టీంకు దూరం కావడంతో పరిస్థితులు మారిపోయాయి. కెప్టెన్ అవుతాడనుకున్న వాడు కనీసం వైస్ కెప్టెన్ కూడా కాకపోవడం గమనార్హం.

    Shreyas Iyer

    విరాట్ కోహ్లి తరువాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యరే అని అనుకున్నా పరిస్థితుల ప్రభావంతో అతడు కెప్టెన్సీకి దూరమయ్యాడు. తరువాత వచ్చిన రోహిత్ శర్మ కెప్టెన్ కావడం తెలిసిందే. దీంతో శ్రేయాస్ అయ్యర్ భవితవ్యం గందరగోళంలో పడింది. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి కావడంతో కిస్మత్ తడబాటుకు గురైంది. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్స్ చేర్చిన ఘనత అయ్యర్ దే. ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అదే అయ్యర్ కెరీర్ ను మార్చేసింది.

    Also Read: Virat Kohli: విరాట్ కోహ్లి ఇక మారడా?.. ఉతికారేస్తున్న క్రికెట్ అభిమానులు

    టీమిండియా కెప్టెన్ ఎంపిక జరిగిపోవడం వైస్ కెప్టెన్ ను సైతం సెలెక్ట్ చేయడం జరిగిపోయాయి. దీంతో శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే మిగిలింది. 2021 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బాధ్యతలు రిషబ్ పంత్ అందుకున్నాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ ను వదిలి కోల్ కత నైట్ రైడర్స్ కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జరిగిన టీం మేనేజ్ మెంట్ నిర్ణయాల వల్ల చేదు ఫలితాలు ఎదురయ్యాయి. దీనికి శ్రేయాస్ అయ్యరే బాధ్యత వహించాల్సి వచ్చిది. అలా టీమిండియా కెప్టెన్ కాలేకపోయాడు.

    Shreyas Iyer

    గాయం నుంచి అయ్యర్ కోలుకున్నా అప్పటికే సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలో చోటు సంపాదించుకుని మిడిల్ ఆర్డర్ లో రాణిస్తున్నాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో ఎవరైనా ఆటగాడు గాయాల కారణంగా జట్టు నుంచి నిష్ర్కమిస్తేనే అయ్యర్ కు చాన్స్ వస్తుంది. ఇలా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. అందివచ్చిన అవకాశం గాయం కారణంగా దూరం కావడంతో ఇప్పుడు జట్లులో చోటు కోసం తపిస్తున్నాడు. విధి అంటే ఇదేనేమో. సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా తప్పుకోవడంతో శ్రీలంకతో జరిగిన టీ 20 మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో జట్టులోకి వచ్చినా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం గమనార్హం.

    వెస్టిండీస్ పర్యటనకు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చినా శ్రేయాస్ అయ్యర్ కు మాత్రం కెప్టెన్సీ అప్పగించలేదు బీసీసీఐ. అంటే శ్రేయాస్ అయ్యర్ మీద నమ్మకం పోయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు కెప్టెన్సీ చేయడం ఇక కలగానే మిగులుతోందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

    Also Read:Prabhas Food: ప్రభాస్ ప‌ర్ఫెక్ట్‌ గా వండే ఫుడ్ ఇదే, ఎక్కడ వండుతాడో తెలుసా ?

    Tags