Shreyas Iyer Destroys Ashwin : దయాల్ బౌలింగ్లో రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. ఓడిపోవాల్సిన మ్యాచును కోల్ కతా గెలిచింది. ఇక తర్వాత సీజన్లో గుజరాత్ దయాల్ ను వదిలేసింది. నాటి రింకు సింగ్ విధ్వంసం వల్ల దయాల్ చాలా రోజులపాటు బయటి ప్రపంచంలోకి రాలేదు. ఆ తర్వాత అదే ఏడాది బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. ఇక ప్రస్తుతం ఆ జట్టు సాధిస్తున్న విజయాలలో దయాల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు దయాల్ అనుభవం ముంబై బౌలర్ అశ్వినీ కుమార్ కు ఎదురైంది.
Also Read : బుమ్రా యార్కర్లు అంటే అందరికీ భయం.. వాటిని అయ్యర్ ఎలా ఎదుర్కొన్నాడంటే.. వైరల్ వీడియో
పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అశ్విని కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రియాన్ష్ ఆర్య, నెహల్ వదేరా ను వెనక్కి పంపించాడు. దీంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అశ్విని కుమార్ కు 19 ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. అప్పటికి పంజాబ్ జట్టు స్కోర్ 181/5. పంజాబ్ విజయం సాధించాలంటే 12 బంతుల్లో 24 పరుగులు అవసరం . ఈ దశలో అశ్వని కుమార్ కు పాండ్యా బంతి అందించాడు. అతనితో అద్భుతంగా బౌలింగ్ గురించి పంజాబ్ మీద ఒత్తిడి పెంచాలని అనుకున్నాడు. కానీ అయ్యర్ హార్దిక్ పప్పులు ఉడకకుండా చేశాడు.. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా 19 ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఒకే ఓవర్ లో నాలుగు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు.. ఇక ఒత్తిడిలో అశ్విని కుమార్ నోబ్, వైడ్ బాల్స్ వేసి ముంబై జట్టుకు మరింత నష్టాన్ని చేకూర్చాడు. తద్వారా ముంబై జట్టు.. మరో ఓవర్ మిగిలి ఉండగానే.. ప్రత్యర్థి ముందు తలవంచింది.
ఇక ఈ ఓవర్ లో ఏకంగా 24 పరుగులు చేసి.. అయ్యర్ తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.. ఇక ఈ ఓవర్లో 26 పరుగులు ఇచ్చి అశ్విని కుమార్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. తద్వారా వచ్చే సీజన్లో తన స్థానాన్ని ముంబై జట్టులో ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అయ్యర్ విధ్వంసం వల్ల.. అశ్విని కుమార్ కు నిద్రలేని రాత్రులు పరిచయమయ్యాయి. మరి ఈ కలత నుంచి అతడు ఎలా బయటపడతాడో చూడాలి మరి. అశ్వని కుమార్ ప్రారంభంలో ముంబై జట్టు సాధించిన విజయాలలో కీలకంగా మారాడు.. అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రత్యేకంగా ముంబై జట్టు ఓనర్ నీతా అంబానీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కానీ అతడు ముఖ్యమైన మ్యాచ్లో చేతులెత్తేశాడు. రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. బంతి మీద పట్టు సాధించలేక అత్యంత ధారాళంగా పరుగులు ఇచ్చి పరువు తీసుకున్నాడు.
THE WINNING SIX BY SHREYAS IYER pic.twitter.com/TuEE4yvGm4
— Johns. (@CricCrazyJohns) June 1, 2025