Shivam Dube master stroke: ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా గెలిచింది. మూడో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. దీంతో నాలుగో మ్యాచ్పై తీవ్ర స్థాయిలో ఆసక్తి ఏర్పడింది. ఇక నాలుగో మ్యాచ్ క్విన్స్ ల్యాండ్ వేదికగా గురువారం జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ మొదలు పెట్టిన టీం ఇండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వికెట్ కు గిల్, అభిషేక్ శర్మ 56 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత వన్ డౌన్ ఆటగాడిగా శివం దూబే మైదానంలోకి వచ్చాడు. మొదట్లో అతడు నిదానంగా ఆడాడు.. ఆ తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఆడం జంపా బౌలింగ్లో అదరగొట్టాడు.
జంపా 11 ఓవర్ తొలి బంతిని గిల్ సింగిల్ తీశాడు. ఆ తర్వాత దూబే స్ట్రైక్ అందుకున్నాడు. రెండో బంతిని భారీ సిక్సర్ కొట్టాడు. అతడు కొట్టిన కొట్టుడుకు బంతి మైదానం అవతల పడింది.. దీంతో జంపా దెబ్బకు తల పట్టుకున్నాడు. బంతి మైదానం అవతల పడడంతో అంపైర్లు కొత్త బంతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఓవర్ లో శివం 11 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఎలిస్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జంప బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు ఒక ఆట ఆడుకున్నారు. 3 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 39 పరుగులు ఇచ్చాడు..
18 బంతులు ఎదుర్కొన్న శివం దూబే ఒక ఫోర్, ఒక సిక్సర్ సహాయంతో 22 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 పరుగులు చేశాడు.. టీమిండియా గడిచిన రెండు మ్యాచ్ లలో తొలి వికెట్ కు గొప్ప భాగస్వామ్యాన్ని నమోదు చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం 56 పరుగులు నమోదు చేసింది. అయితే ఇదే జోరు గనుక టీమ్ ఇండియా కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ అభిషేక్ శర్మ జంపా బౌలింగ్ లో భారీ షాట్ కొట్టినప్పటికీ అది క్లిక్ కాలేదు. అది నేరుగా వెళ్లి డేవిడ్ చేతిలో పడింది. ఇక ఈ మ్యాచ్లో మరో ఓపెనర్ గిల్ ఫామ్ లోకి వచ్చాడు. చాలా రోజుల తర్వాత తన పూర్వపు బ్యాటింగ్ స్టైల్ చూపించాడు. ఈ కథనం రాసే సమయం వరకు అతడు 37 బంతుల్లో 45 పరుగులు చేశాడు.. ఇందులో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి.
Shivam dubey launches a big six#AUSvsINDpic.twitter.com/lJg2ppATBL
— Akhil (@crickfever00) November 6, 2025