ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలిరోజు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత ఆస్ట్రేలియాను 195 పరుగులకే కట్టడి చేసిన భారత్ తర్వాత బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది.
Also Read: ఆ మాటలను ధోనీ నిజం చేశాడు
ఇక 195కి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన టీమిండియా శనివారం ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. క్రీజులో శుభ్ మన్ గిల్ 28, ఛతేశ్వర్ పూజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 11 ఓవర్లు కాచుకొని 36/1తో గట్టి పునాది వేశారు. రెండోరోజు టీమిండియా నిలబడితే ఈ టెస్టుపై పట్టు బిగించినట్టే..
అయితే భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి ఓవర్ లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరువకుండానే ఓపెన్ మయాంక్ అగర్వాల్ డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం గిల్, పూజారా వికెట్ పడకుండా కాపాడుకున్నారు.
Also Read: భారత్ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ
ఇక కెరీర్ లోనే తొలి టెస్టు ఆడుతున్న గిల్ ఏ మాత్రం భయపడకుండా స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఏకంగా భారత బ్యాట్స్ మెన్ తడబడుతున్న వేళ ఐదు బౌండరీలు గిల్ బాదడం విశేషం.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బుమ్రా 4 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 3, సిరాజ్ 2 వికెట్లు తీసి చెలరేగారు. లబుషేన్ 48, హెడ్ 38 పరుగులతో ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. దీంతో 195 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది.