Sania Mirza sister assets: సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ టెన్నిస్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. అంతర్జాతీయ వేదికలలో సింగిల్స్ విభాగంలో సత్తా చూపించలేకపోయినప్పటికీ.. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో అదరగొట్టింది. ఆటకు ఆట, అందానికి అందంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సానియా మీర్జా సొంతం చేసుకుంది. సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆ ఆటతో ఆమె ఇప్పటికి కూడా ప్రత్యక్షమైన సంబంధాన్ని కొనసాగిస్తోంది.
టెన్నిస్ కు గుడ్ బాయ్ చెప్పినప్పటికీ.. ఆమె హైదరాబాదులో టెన్నిస్ అకాడమీ కొనసాగిస్తోంది. వర్ధమాన ప్లేయర్లకు శిక్షణ ఇస్తూ.. వారిలో నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సానియా మీర్జా.. అతడి ద్వారా ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. కొంతకాలం పాటు వారిద్దరి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడిన నేపథ్యంలో.. విడాకులు తీసుకున్నారు. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ టీవీ లో పనిచేసే యువతిని వివాహం చేసుకున్నాడు.
భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా కొద్ది రోజుల వరకు ఇబ్బంది పడింది. ఆ తర్వాత ధైర్యంతో జీవితంలో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం సానియా మీర్జా టెన్నిస్ అకాడమీతో పాటు.. వివిధ సంస్థలకు అంబాసిడర్ గా కొనసాగుతోంది. సానియా మీర్జా ఆస్తుల విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం 216 కోట్ల వరకు ఉంటుంది. అయితే సానియా మీర్జా కంటే ఆమె సోదరి ఆనం మీర్జా ఆస్తుల విలువ ఎక్కువ. ఇప్పటి బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఆనం మీర్జా ఆస్తులు ఏకంగా 331 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది.
సానియా మీర్జా కంటే ఆనం మీర్జా ఆస్తులు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఆమె ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నిర్వహిస్తోంది. ఈ సంస్థ సెలబ్రిటీల వివాహాలనుంచి మొదలుపెడితే వివిధ వేడుకల వరకు నిర్వహిస్తూ ఉంటుంది. ఈమెకు ప్రపంచ వ్యాప్తంగా క్లైంట్లు ఉన్నారు. అందువల్లే ఆనం మీర్జా సంపాదనలో సోదరి సానియా మీర్జా కంటే ముందంజలో ఉంది. ఆనం మీర్జా బిజినెస్ మేనేజ్మెంట్ చదువులు చదివింది. అందువల్లే ఆమె వ్యాపారం లోకి ప్రవేశించింది. వ్యాపారంలో నిత్యం వినూత్నమైన విధానాలు పాటించడం వల్ల ఆమె ఈ స్థాయిలో డబ్బు సంపాదించిందని తెలుస్తోంది. ఆనం మీర్జా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కొడుకును వివాహం చేసుకుంది.