Homeక్రీడలుSania Mirza: మహిళల్లో మీరు చూడాల్సింది అది కాదు, సానియా మీర్జా సంచలన పోస్ట్

Sania Mirza: మహిళల్లో మీరు చూడాల్సింది అది కాదు, సానియా మీర్జా సంచలన పోస్ట్

Sania Mirza: సానియా మీర్జా సోషల్ మీడియా పోస్ట్ ఒకటి సంచలనం రేపుతోంది. తాను సాధించిన విజయాలను గుర్తించకుండా వివక్షతకు గురి చేశారు. అవమానించారని పరోక్షంగా వాపోయారు. అంతర్జాతీయ టెన్నిస్ కి రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా కెరీర్లో అతి గొప్ప విజయాలు అందుకుంది. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి మహిళా టెన్నిస్ క్రీడారిణి సానియా మీర్జా. 16 ఏళ్లకే ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ గా అరంగేట్రం చేసింది. సుదీర్ఘ కెరీర్ లో సానియా మీర్జా 43 అంతర్జాతీయ టైటిల్స్ గెలిచింది. అందులో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.

91 వారాల పాటు ఆమె డబుల్స్ లో నెంబర్ వన్ క్రీడాకారిణిగా ఉన్నారు. అయితే సానియా మీర్జా మత విద్వేషానికి, స్త్రీ వివక్షతకు గురైంది. టెన్నిస్ కోసం ఆమె ధరించే బట్టలపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మత పెద్దల నుండి ఆమె వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అలాగే సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకోవడాన్ని భారతీయులు తప్పుబట్టారు.

పాకిస్తాన్ కోడలు అంటూ ఎద్దేవా చేశారు. భారత్ కి టెన్నిస్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ శత్రు దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పై విమర్శలు గుప్పించారు. గతంలో జరిగిన ఈ పరిణామాలను సానియా మీర్జా గుర్తు చేసుకున్నారు. ఆవేదనతో కూడిన పోస్ట్ పెట్టారు. వ్యాపార ప్రకటనలో ఓ మహిళ తన సొంత డబ్బులతో కారు కొనుక్కుంటుంది. దానికి చుట్టూ ఉన్న సమాజం హర్షించరు.

పొరుగువారి విమర్శల నేపథ్యంలో ఆమె బ్రదర్ కూడా కారు విషయంలో ప్రశ్నిస్తాడు. మీరు కారు మాత్రమే చూస్తున్నారు. దాని వెనకున్న నా కష్టం చూడడం లేదు. మహిళలు విజయం సాధించిన ప్రతిసారి సమాజం కించ పరుస్తూనే ఉంటుంది. అందుకు మనం ఆగిపోకూడదు అని ఆమె అంటుంది. ఈ యాడ్ షేర్ చేసిన సానియా… టెన్నిస్ లో నేను ఎన్నో విజయాలు సాధించాను. దేశానికి పేరు తెచ్చాను. ఇవేమీ చూడని కొందరు నా ఆహార్యం, అసమానతల గురించి ఎందుకు చర్చిస్తారు. ఒక స్త్రీ కష్టానికి సమాజం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పోస్ట్ పెట్టింది… సానియా పోస్ట్ వైరల్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular