Salman Agha statement: టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసియా కప్ లో భారత జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. వ్యక్తిగతంగా తన ప్రదర్శన బాగోలేకపోయినప్పటికీ.. నాయకుడిగా మాత్రం సూర్య కుమార్ యాదవ్ విజయవంతమయ్యాడు. బౌలింగ్ లో మార్పులు.. బ్యాటింగ్లో చేర్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో టీమిండియాను గెలిపించిన తర్వాత కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక సూపర్ 4 మ్యాచ్ లో గెలిచిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ మరింత రెచ్చిపోయాడు. ఇంకోసారి తమకు పాకిస్తాన్ జట్టును సమ ఉజ్జి అనకూడదని.. సమానంగా పోటీ పడితేనే సమ ఉజ్జి అంటారని.. తమకు పోటీనే ఇవ్వలేని పాకిస్తాన్ జట్టును సమఉజ్జీ ఎలా అంటారని సూర్య కుమార్ ప్రశ్నించాడు.
సూర్య కుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్లో విఫలమైనప్పటికీ.. జట్టును మాత్రం అద్భుతంగా ముందుకు నడిపించాడు. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నుంచి తీసుకోవడానికి నిరాకరించాడు. ఆ తర్వాత ట్రోఫీ లేకుండానే జట్టు సభ్యులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నాడు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసియా కప్ లో తను ఆడిన ఏడు మ్యాచ్లకు సంబంధించిన ఫీజును పహల్గాం బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. వారి త్యాగం వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని పేర్కొన్నాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ దేశం నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
సూర్య కుమార్ యాదవ్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా అనుసరిస్తున్నాడు. తన మ్యాచ్ ఫీజులను ఆపరేషన్ సిందూర్ బాధితులకు ఇస్తామని ప్రకటించాడు. అయితే ఇండియా చేసిన దాడుల్లో చనిపోయింది ఉగ్రవాదులు.. అలాంటప్పుడు టెర్రరిస్టులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ” భారత దేశం చేసిన దాడుల్లో ఏ ఒక పాకిస్తాన్ దేశస్థుడు చనిపోలేదు. ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారు. పాకిస్తాన్ కెప్టెన్ మాత్రం ఆపరేషన్ సిందూర్ బాధితులకు ఇస్తామని చెబుతున్నాడు. ఇలాంటప్పుడు ఉగ్రవాదులకు పాకిస్తాన్ కెప్టెన్ సపోర్ట్ చేస్తున్నాడనే అనుకోవాల్సి ఉంటుంది కదా అని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
“Not just disrespectful to us, but to cricket.” ❗️
Pakistan captain Salman Agha does not mince his words when speaking about Suryakumar Yadav-led India and their conduct in #AsiaCup2025
FULL VIDEO: https://t.co/PTgc4NUDKd pic.twitter.com/w8G6utT7gI
— TOI Sports (@toisports) September 29, 2025