Homeక్రీడలుక్రికెట్‌Salil Arora No Look Six: భీకర బుమ్రాపై సలీల్ అరోరా నో లుక్స్ సిక్స్.....

Salil Arora No Look Six: భీకర బుమ్రాపై సలీల్ అరోరా నో లుక్స్ సిక్స్.. అరాచకం అంతే.. వైరల్ వీడియో

Salil Arora No Look Six: వందల వికెట్లు.. అద్భుతమైన విజయాలు.. తోపు బ్యాటర్లు కూడా తలవంచారు. పరుగులు తీయడం కాదు కదా.. వికెట్ కాపాడుకుంటే గొప్ప అని భావించారు. ఆ స్థాయిలో బౌలింగ్ వేసిన అతడి పేరు బుమ్రా. అత అతడికి ఫార్మాట్ తో సంబంధం లేదు. మైదానంతో సంబంధం లేదు. ఆటగాళ్లతో కూడా సంబంధం లేదు. అద్భుతానికి మించి బౌలింగ్ చేస్తాడు. వికెట్లను అత్యంత వేగంగా తీస్తాడు. అందువల్లే అతడిని ఈ కాలపు అద్భుతం అని పిలుస్తుంటారు.

ఆ స్థాయిలో బౌలింగ్ వేసే బుమ్రా ప్రస్తుత ఐపిఎల్ లో తేలిపోతున్నాడు. ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. కనీసం వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. అతడు ఇలా బౌలింగ్ చేయడం పట్ల తోటి బౌలర్లు మాత్రమే కాదు, అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంతిని అనేక విధాలుగా తిప్పి వేసే బుమ్రా ఇలా మారిపోవడం పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.. నిజంగా బౌలింగ్ వేస్తోంది బుమ్రానేనా అని అనుకుంటున్నారు..

హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బుమ్రా అత్యంత దారుణంగా బౌలింగ్ వేసాడు. నాలుగు ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు. వాస్తవానికి అతని బౌలింగ్ స్థాయికి ఇలాంటి పరుగులు ఇవ్వడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బంతి మీద ఏమాత్రం పట్టు సాధించలేకపోయాడు. ముఖ్యంగా సలీల్ ఆరోరా లాంటి ఆటగాడు కూడా బుమ్రా బౌలింగ్లో సిక్సర్ కొట్టాడు. అది కూడా నెవర్ బిఫోర్ అన్నట్టుగా.. అతడి బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన ఆరోరా.. కనీసం బంతి వైపు కూడా చూడలేదు.. భీకరమైన బుమ్రా ఇలా సిక్సర్ కొట్టడం పట్ల ఆరోరా మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

బుమ్రా బౌలింగ్లో అంతకుముందు హెడ్ కూడా బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లు, ఫోర్లు కొట్టి అదరగొట్టాడు. ఆ తర్వాత క్లాసెన్ కూడా అదే స్థాయిలో ఆడాడు.. చివరికి ఆరోరా కూడా బీభత్సంగా బ్యాటింగ్ చేసి సంచలనం సృష్టించాడు.. అతడు కొట్టిన సిక్సర్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version