Site icon OkTelugu

Kohli Vs Head: హెడ్ తో గొడవ.. షేక్ హ్యాండ్ ఇవ్వని విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

Kohli Vs Head

Kohli Vs Head

Kohli Vs Head: జాతీయ జట్టులోనే కాదు.. ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ ఎప్పటికీ పతాక శీర్షిక స్థాయి వార్తలలోనే ఉంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ వీరావేశం ఉన్న ఆటగాడు. బ్యాటింగ్ విషయంలో.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడు. అందులో ఏమాత్రం తగ్గడు. పైగా ప్రత్యర్థి ఆటగాళ్లలో ఎవరైనా తనను గెలికితే అప్పుడు మరింత రెచ్చిపోతాడు విరాట్.

శుక్రవారం బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం రెండు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు పరస్పరం అభినందనలు తెలుపుతున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. అయితే విరాట్ కోహ్లీ హైదరాబాద్ ప్లేయర్లందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హెడ్ కు మాత్రం అసలు ఇవ్వలేదు.. హెడ్ చెయ్యి ముందుకు చాపినప్పటికీ విరాట్ కోహ్లీ ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీని వెనక ఒక కారణం ఉంది.

బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు హెడ్ ఏదో అన్నాడు. దీంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు వచ్చి బౌలింగ్ చేయి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. అయితే అప్పటికే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. నేను బౌలింగ్ చేసే సమయానికి నువ్వు లేవు అన్నట్టుగా హెడ్ సంకేతాలు చేశాడు. దీనిని మనసులో పెట్టుకున్న విరాట్ కోహ్లీ అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనక్కి వెళ్లిపోయాడు..

విరాట్ కోహ్లీ ఇప్పుడే కాదు.. గతంలో అనేక సందర్భాలలో ఆస్ట్రేలియా ప్లేయర్ల మీద ఇలానే వ్యవహరించాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తుంటే ఏమాత్రం నచ్చదు. గతంలో టీమ్ ఇండియా ప్లేయర్లు అంతగా స్పందించేవారు కాదు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ గట్టిగా కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టాడో .. అప్పటినుంచి ఆస్ట్రేలియా ప్లేయర్లు తగ్గడం మొదలుపెట్టారు. అంతేకాదు టీమ్ ఇండియా ప్లేయర్లు అంతకుమించి అనేలాగా ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లకు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు తగ్గి ఉంటున్నారు. అప్పుడప్పుడు హెడ్ తల బిరుసు తనం ప్రదర్శిస్తున్నప్పటికీ.. టీమిండియా ప్లేయర్లు గట్టిగా కౌంటర్ ఇస్తుండడంతో అతడు కూడా సైలెంట్ అయిపోతున్నాడు.

Exit mobile version