Saim Ayub Ducks In Asia Cup: సౌత్ ఆఫ్రికా నుంచి టీం ఇండియా వరకు.. క్రికెట్లో ఆడే వాళ్లకు మాత్రమే అవకాశాలు లభిస్తాయి. ఆడని వాళ్లకు అవకాశాలు ఉండవు. కానీ అదే చిత్రమో పాకిస్తాన్ మేనేజ్మెంట్ ఇందుకు పూర్తి విభిన్నం. ఎందుకంటే ఆ జట్టులో ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు. ఎప్పుడు పరుగులు చేస్తాడో.. ఎప్పుడు వికెట్లు తీస్తాడో ఎవరికీ అంతు పట్టదు. ఈ భూమ్మీద అత్యంత అనిశ్చితికరమైన క్రికెట్ ఆడే జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే. అందువల్లే ఆ జట్టు కొంతకాలంగా దారుణమైన ఫలితాలను అందుకుంటున్నది. సొంత దేశంలో చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ మేజర్ టోర్నీ నిర్వహించినప్పటికీ విజేతగా నిలవలేకపోతున్నది.
తాజా ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు ప్రయాణం భారత్ మినహా మిగతా జట్ల మీద సజావుగానే సాగుతోంది. సూపర్ 4 తొలి మ్యాచ్లో భారత్ మీద పాకిస్తాన్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు ఒకరు అద్భుతమైన రికార్డును సృష్టించారు. వాస్తవానికి ఈ రికార్డును మరే ఆటగాడు అందుకోలేడు. ఎందుకంటే అతడు సాధించిన ఘనత అటువంటిది కాబట్టి. ప్రస్తుత ఆసియా కప్ లో అతడు తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నాడు. పరుగుల విషయంలో కాదు.. సున్నాలు చుట్టడంలో..
ఆసియా కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఆయుబ్ అనే ఆటగాడి విషయంలో ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. కేజిఎఫ్ స్థాయిలో గొప్పలు పోయింది. కానీ అతడు మాత్రం గొప్పగా ఆడలేక పోతున్నాడు. భారీగా పరుగులు పక్కన పెడితే, కనీసం సింగిల్ డిజిట్ కూడా చేయలేకపోతున్నాడు.. వరుసగా నాలుగు మ్యాచ్ లలో సున్నాలు చుట్టి “ఆడి” లోగో ను తన పేరు మీద రాసుకున్నాడు.. భారత్ మీద నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు ఇలా ప్రతి మ్యాచ్ లోను అతడు 0 పరుగులు చేశాడు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడం..తో పాకిస్తాన్ అభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అసలు ఇటువంటి ఆటగాడిని ఎందుకు ఎంపిక చేశారు అంటూ మండిపడుతున్నారు.
The Man The Myth The legend
New Brand ambassador of Audi #PakistanCricket #PAKvsBAN #PAKvBAN pic.twitter.com/DxMjQae0vT
— Vishwas Goswami (@ViswasGoswami) September 25, 2025